బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా తిరగాలని డిసైడయ్యారు. అన్ని జిల్లాలకు వెళ్ళి, పార్టీ మీటింగ్స్ పెట్టి కేడర్లో ఉత్సాహం నింపాలన్నది ప్లాన్ అట. సిల్వర్ జూబ్లీ వేడుకలకు సిద్ధమవుతోంది గులాబీ పార్టీ. ఈ క్రమంలోనే జిల్లా కేంద్రాల్లో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశాలు నిర్వహించేలా కార్యాచరణ ఖరారైందట
KTR- Harish Rao: మీడియాతో జరిగిన చిట్ చాట్ లో బీఆర్ఎస్ శ్రేణులు మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి డిలిమిటేషన్ పై చిత్తశుద్ధి లేదు అన్నారు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ వైఖరి ఎంటో చెప్పలేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో అధికారం లేదు.. అధికారంలో ఉన్న బీజేపీకి మేము డీ లిమిటేషన్ పై చెప్పాల్సింది గట్టిగా చెప్తాం..
Konda Surekha: తెలంగాణ అసెంబ్లీలో లాబీలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మీడియాతో చిట్ చాట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట బోర్డు ఉండాలని చట్ట సవరణ చేశాం.. టీటీడీకి స్వయం ప్రతిపత్తి ఉంటుంది.. కానీ, యాదగిరిగుట్ట బోర్డుకు ప్రభుత్వం కంట్రోల్ లో ఉంటుంది అని తెలిపారు.
మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర బడ్జెట్ గురించి చెప్పమంటే.. సీఎం ఢిల్లీకి పంపే మూటల లెక్కలు చెప్తున్నాడని అన్నాడు. ఖర్గే, రాహుల్, ప్రియాంకగాంధీ, కేసీ వేణుగోపాల్ కు డబ్బులు పంపే పనిలో రేవంత్ బిజీ గా ఉన్నాడని వెల్లడించాడు. బీజేపీ, కాంగ్రెస్ నేతల రహస్య సమావేశాలపై రాజసింగ్ చేసిన కామెంట్స్ ను ఎందుకు ఖండించటం లేదని ప్రశ్నించారు. రాజాసింగ్ ను సస్పెండ్ చేసే దమ్ము…
ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో విద్యార్థుల ఆందోళనలపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీచేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు గ్యారెంటీలను అటకెక్కించిన కాంగ్రెస్ సర్కారు.. ఏడో గ్యారెంటీకి కూడా ఏడాదిన్నరలోనే ఘోరీ కట్టిందని విమర్శించారు.
KTR : బీజేపీ, కాంగ్రెస్ మధ్య రహస్య ఒప్పందం ఉందని మరోసారి తీవ్ర విమర్శలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR). బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (BJP MLA Raja Singh) తన పార్టీ నేతలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రహస్య సమావేశం నిర్వహించారని గతంలో మండిపడ్డ విషయాన్ని మరోసారి ప్రస్తావించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ప్రజా సమస్యలపై అధికారికంగా సమీక్షలు నిర్వహించాలి కానీ, రహస్యంగా బీజేపీ నేతలతో…
KTR : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదేపదే ఢిల్లీ పర్యటనలు చేస్తూ, అక్కడి నుంచి రాష్ట్రానికి ఎటువంటి నిధులు తీసుకురాలేకపోతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం పదవి చేపట్టినప్పటి నుంచి రేవంత్ రెడ్డి మొత్తం 39 సార్లు ఢిల్లీకి వెళ్లినప్పటికీ, రాష్ట్రాభివృద్ధికి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేకపోయారని కేటీఆర్ విమర్శించారు. రేవంత్ తీరు “గల్లీలో హోదా మరిచి తిట్లు, ఢిల్లీలో చిట్చాట్లు” అన్నట్లు ఉందని, తన కార్యాలయం దాటి బయటకి…
Raghunandan Rao : తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అనుమతించకపోతే, రాష్ట్రంలోని అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు కలిసి తిరుమలలో టీటీడీ అధికారులతో తేల్చుకుంటామని మెదక్ ఎంపీ, బీజేపీ నేత రఘునందన్ రావు హెచ్చరించారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖల ద్వారా భక్తులకు దర్శన అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు. శుక్రవారం తిరుమల శ్రీవారిని వీఐపీ బ్రేక్ దర్శనం ద్వారా దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన రఘునందన్ రావు,…
Ponnam Prabhakar: చట్టసభల్లో ప్రజాస్వామ్యానికి సభకు నాయకుడు ముఖ్యమంత్రి అయితే, సభ మొత్తానికి అధిపతి స్పీకర్ అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అటువంటి స్పీకర్ ని పట్టుకొని సభ మీ ఒక్కడిది కాదు అని మాట్లాడడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం.
Beerla Ilaiah: హరీష్ రావు ముఖ్యమంత్రి కుర్చీని అగౌరవపరిచేలా మాట్లాడుతున్నారు అని ప్రభుత్వ విప్ బీర్ల ఐల్లయ్య అన్నారు. నిన్న గవర్నర్ ప్రసంగం అడ్డుకునే ప్రయత్నం చేశారు.. తెలంగాణ ప్రజానీకం గమైస్తున్నది.. మీరు ప్రజా ప్రతినిధుల లెక్క వ్యవహరిస్తలేరు పందికొక్కుల్లా వ్యవహరిస్తున్నారు అని మండిపడ్డారు.