ఏ యూట్యూబర్లను అడ్డం పెట్టుకుని సీఎం అయ్యారో.. అదే యూట్యూబర్లపై కేసులు పెడుతున్నారు.. బీఆర్ఎస్ నేతల్ని సోషల్ మీడియాలో ఎంతగా తిట్టారో ప్రజలకు తెలుసు అని చెప్పుకొచ్చారు. అలాగే, రేవంత్ రెడ్డి జాక్ పాట్ సీఎం అంటూ కేటీఆర్ విమర్శలు గుప్పించారు.
KTR : తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో స్పందించారు. బడ్జెట్లో ప్రభుత్వం ఆరు గ్యారంటీలను పూర్తిగా పక్కన పెట్టిందని ఆక్షేపిస్తూ, ఎన్నికల ముందు వంద రోజులలో హామీలన్నీ అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, తాజా బడ్జెట్లో ప్రజలకు మొండిచేయి చూపించిందని మండిపడ్డారు. ఈ సందర్భంగా కేటీఆర్ తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘X’లో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం…
తిరుమల తొక్కిసలాట ఘటనపై కొనసాగుతున్న విచారణ. నేడు CVSO శ్రీధర్‌ను విచారించనున్న కమిషన్. 21 నుంచి 3 రోజుల పాటు 42 మంది విజిలెన్స్ సిబ్బంది 32 మంది పోలీసులను విచారించనున్న కమిషన్. విచారణకు హాజరుకావాలని ఇప్పటికే నోటీసులు జారీ. వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌పై నేడు తుది విచారణ. SLBC టన్నెల్లో 27వ రోజు రెస్క్యూ ఆపరేషన్. గల్లంతైన ఏడుగురి కోసం క్యాడవర్ డాగ్స్‌తో గాలింపు. డీ2, డీ1 ప్రదేశాల్లో మిని జేసీబీలతో తవ్వకాలు. ఆచూకీ…
Ponnam Prabhakar : తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు, మైనార్టీల స్థానం, విద్యుత్ సబ్సిడీలు, రైతుల సంక్షేమం, ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ చర్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్ బిల్లు రాజకీయంగా ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 42% గా ప్రకటించడం రాజ్యాంగబద్ధంగా, రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత కలిగినదని మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు ఎవరూ చేయలేని విధంగా ఈ బిల్లును తీసుకువచ్చినట్టు పేర్కొన్నారు.…
KTR : తెలంగాణ హైకోర్టు మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)పై నమోదైన కేసును కొట్టివేసింది. సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసుపై విచారణ జరిపిన హైకోర్టు, ఇరువురి వాదనలు పరిశీలించి ఎఫ్ఐఆర్ను రద్దు చేస్తూ కీలక తీర్పు ఇచ్చింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ కేటీఆర్‌పై కేసు నమోదు జరిగింది. ఈ వ్యవహారంపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఈ కేసులో సరైన…
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శాసన సభలో రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2025-26 ను ప్రవేశపెట్టారు. రూ. 3 లక్షల 4 వేల 965 కోట్ల బడ్జెట్ ను రేవంత్ సర్కార్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ పై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కేటీఆర్ మాట్లాడుతు.. “రాష్ట్రంలో రైతులు, ప్రజలు ఎదురు చూశారు.. కానీ ఆరు గ్యరెంటీలు గోవిందా అని అర్థం అయ్యింది.. ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇది రెండో బడ్జెట్…
తెలంగాణ అసెంబ్లీలో కాసెపట్లో ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ రేవంత్ సర్కార్ పై తీవ్ర విమర్శలు గుప్పించింది. రైతులకు మద్దతుగా ఎండిన వరిగడ్డితో అసెంబ్లీకి చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. “రాష్ర్టంలోని రైతన్నల్లో ధైర్యం నింపడానికి బిఆర్ఎస్ ముందుకు వచ్చింది.. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో ఎండిపోతున్న పాటలను ప్రభుత్వం దృష్టికి తేవడానికి ఎండిన వరి గడ్డితో అసెంబ్లీ కి వచ్చాము.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకా…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా, ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా తిరగాలని డిసైడయ్యారు. అన్ని జిల్లాలకు వెళ్ళి, పార్టీ మీటింగ్స్ పెట్టి కేడర్‌లో ఉత్సాహం నింపాలన్నది ప్లాన్ అట. సిల్వర్ జూబ్లీ వేడుకలకు సిద్ధమవుతోంది గులాబీ పార్టీ. ఈ క్రమంలోనే జిల్లా కేంద్రాల్లో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశాలు నిర్వహించేలా కార్యాచరణ ఖరారైందట
KTR- Harish Rao: మీడియాతో జరిగిన చిట్ చాట్ లో బీఆర్ఎస్ శ్రేణులు మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి డిలిమిటేషన్ పై చిత్తశుద్ధి లేదు అన్నారు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ వైఖరి ఎంటో చెప్పలేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో అధికారం లేదు.. అధికారంలో ఉన్న బీజేపీకి మేము డీ లిమిటేషన్ పై చెప్పాల్సింది గట్టిగా చెప్తాం..
Konda Surekha: తెలంగాణ అసెంబ్లీలో లాబీలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మీడియాతో చిట్ చాట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట బోర్డు ఉండాలని చట్ట సవరణ చేశాం.. టీటీడీకి స్వయం ప్రతిపత్తి ఉంటుంది.. కానీ, యాదగిరిగుట్ట బోర్డుకు ప్రభుత్వం కంట్రోల్ లో ఉంటుంది అని తెలిపారు.