భారత్‌లోనూ భూప్రకంపనలు.. హడలెత్తిపోయిన ప్రజలు
భారత్‌లోనూ భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేల్‌పై 6.8గా నమోదైనట్లుగా తెలుస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ సహా కోల్‌కతా, రాంచీ, త్రిపుర, అస్సాం, పాట్నాలో భూప్రకంపనలు సంభవించాయి. దీంతో భయంతో విద్యార్థులు, అధ్యాపకులు క్లాస్ రూమ్‌లోంచి బయటకు వచ్చేశారు. అలాగే అధికారులు కూడా కార్యాలయాల్లోంచి ఇళ్లకు వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మయన్మార్, బ్యాంకాక్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 7.7గా నమోదైంది. పెద్ద పెద్ద బిల్డింగ్‌లు కూలిపోయాయి. భారీ ఎత్తున దుమ్ము ఎగిసిపడింది. దీంతో ప్రజలు హడలెత్తిపోయారు. పలు కార్యాలయాల అద్దాలు ధ్వంసం అయ్యాయి. భీకర ప్రకంపనలకు ప్రజలు గజగజ వణికిపోయారు. భయంతో పరుగులు పెట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శుక్రవారం ఉదయం మయన్మార్‌లోని మధ్య ప్రాంతంలో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. అలాగే బ్యాంకాక్‌లో కూడా తీవ్రమైన ప్రకంపనలు సంభవించాయి. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ సహా అనేక ప్రాంతాల్లో ఈ ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు వార్తా కథనాలు వెలువడుతున్నాయి.
ఎమ్మెల్సీగా రిటైర్ అవుతున్న వారు.. ప్రజలకు పార్టీకి ఎంతో సేవ చేశారు
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిపై బీఆర్ఎస్ పార్టీ సభ్యులు ప్రజల పక్షనా శాసన మండలిలో బలమైన వాయిస్ వినిపించారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, మిర్చి పంటకు మద్దతు ధర, పెళ్లి చేసుకునే ఆడ పిల్లలకు తులం బంగారంపై గట్టిగానే ప్రభుత్వాన్ని ప్రశ్నించామన్నారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి మహిళలను ఉద్దేశించి పరుష పదజాలలు ఉపయోగించారని పేర్కొనింది. ప్రభుత్వాన్ని ఎన్ని సార్లు నిలదీసిన వారి దగ్గర నుంచి కనీస సమాధానం కూడా రాలేదని చెప్పుకొచ్చింది. అలాగే, ఎమ్మెల్సీలుగా రిటైర్ అవుతున్న వారు.. ప్రజలకు పార్టీకి ఎంతో సేవ చేశారు అని ఎమ్మెల్సీ కవిత వెల్లడించింది.
చైనా, బంగ్లాదేశ్, దావోస్‌లోనూ భూప్రకంపనలు
ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు భారీ భూకంపాలతో హడలెత్తిపోయాయి. ఈ ఉదయం బ్యాంకాక్, మయన్మార్‌లో పెద్ద ఎత్తున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 7.7గా నమోదైంది. దీంతో భారీ అంతస్తుల బిల్డింగ్‌లు నేలకూలిపోయాయి. భయంతో జనాలు పరుగులు తీశారు. ఈ భూప్రకంపనలు బ్యాంకాక్, మయన్మార్‌తో పాటు భారత్, చైనా, బంగ్లాదేశ్, దావోస్‌లో భారీ భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. స్కూళ్లు, కాలేజీలు, కార్యాలయాల్లోని ప్రజలు బయటకు పరుగులు తీసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉంటే ఆయా ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. థాయ్‌లాండ్, మయన్మార్ ప్రభుత్వాలు అత్యవసర పరిస్థితిని విధించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలు పిలుపునిచ్చాయి. తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాయి. ఇక ఆస్తి, ప్రాణ నష్టంపై మాత్రం ఇంకా వివరాలు రాలేదు. రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగి సహాయ చర్యలు చేపట్టారు.
ఇకపై భవిష్యత్తు మొత్తం భారత్‌దే.. మరో 40 సంవత్సరాలు మనదే..!
ప్రపంచం మొత్తం ఇండియా వైపు చూస్తోంది.. ఇకపై భవిష్యత్తు మొత్తం భారత్‌దే అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఐఐటీ మద్రాస్ లో “అల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్-2025” లో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రపంచం మొత్తం ఇండియా వైపు చూస్తోంది.. ఇకపై భవిష్యత్తు మొత్తం ఇండియాదే అన్నారు.. మద్రాసు ఐఐటీలో 30-40 శాతం పైగా తెలుగు విద్యార్థులే చదువుతున్నారు.. మద్రాసు ఐఐటి దేశంలో నెంబర్ వన్ గా ఉంది.. ఇక్కడ నుండి ఎనబై శాతం స్టార్టప్ విజయవంతం అవుతున్నాయి.. మద్రాస్ ఐఐటీ స్టార్టప్ అగ్నికుల్ మంచి విజయాన్ని అందుకున్నాయని తెలిపారు..
విష్ణుప్రియకు హైకోర్టులో స్వల్ప ఊరట..!
బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌కు సంబంధించి ప్రముఖ సినీ తారలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ వ్యవహారంలో పంజాగుట్ట, మియాపూర్ పోలీసులు మొత్తం 11 మంది సెలబ్రిటీలపై కేసులు నమోదు చేసి, వారికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నటి విష్ణుప్రియ ఈ నెల 20న పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. అయితే, తనపై నమోదైన రెండు ఎఫ్ఐఆర్‌లను రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసుల్లో న్యాయం చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
విష్ణుప్రియ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు, ఎఫ్‌ఐఆర్ రద్దు చేయడాన్ని లేదా దర్యాప్తుపై స్టే (Stay) విధించడం పై అంగీకారం తెలియజేయలేదు. పోలీసులకు సహకరించాల్సిందే అనే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు తన ఉత్తర్వుల్లో 35(3) బిఎన్ఎస్ఎస్ నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా, విష్ణుప్రియను అరెస్ట్ చేయొద్దని పోలీసులను ఆదేశించింది. అయితే, విచారణలో పోలీసులకు సహకరించాల్సిందే అని కోర్టు స్పష్టం చేసింది.
మెడికల్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. వెలుగులోకి సంచలన అంశాలు..!
రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్ లో విధి నిర్వహణలో ఉండగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వైద్య విద్యార్థిని అంజలి ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తుంది. రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్ సూపర్వైజర్ దీపక్ లైంగిక వేధింపులు కారణంగా మనస్థాపనతో అంజలి.. పాయిజన్ తీసుకోవడం వలన మజిల్స్ దెబ్బతిని వెంటిలేటర్ మీద ఉంది.. బ్లీడింగ్ ఆగిపోవడం వలన బ్రెయిన్ కి డ్యామేజ్ అవ్వడంతో వెంటిలేటర్ సపోర్ట్ తో డైలీ మానిటరింగ్ చేస్తున్నారు.. ఎంఆర్ఐ స్కానింగ్ కూడా చేశారు. మిగతా అవయవాలు రికవరీ అవుతున్నప్పటికీ బ్రెయిన్ రికవరీ లేటుగా ఉంది.. బీపీ అన్నీ బాగానే ఉన్నాయని, రికవరీ అనుమానాస్పదంగా ఉందని, అది ఎలా మారుతుందో చెప్పలేమని, నేచురల్ గా రికవరీ అవ్వాలి తప్ప, ఎస్యూరెన్స్ ఇవ్వలేమని వైద్యులు స్పష్టం చేశారు. బ్రెయిన్ డామేజ్ ఎక్కువగా ఉందని, ఇంకా బ్రెయిన్ డెడ్ అవ్వలేదని తెలిపారు.
స్పీకర్ గడ్డం Vs మంత్రి పొన్నం.. కరాటే ఛాంపియన్‌షిప్‌లో అసక్తికర సన్నివేశం..
తెలంగాణ రాజకీయ వేదిక నుంచి కరాటే మ్యాట్‌పైకి.. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నేరుగా కరాటే రింగ్‌లో తలపడ్డారు! ఇదేదో యాక్షన్ సినిమా సన్నివేశం కాదు, హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో వాస్తవంగా జరిగిన విశేషం. శుక్రవారం గచ్చిబౌలి స్టేడియంలో 4వ కియో నేషనల్ కరాటే ఛాంపియన్‌షిప్ 2025 ఘనంగా ప్రారంభమైంది. ఈ వేడుకలో TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి పొన్నం ప్రభాకర్, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కార్యక్రమం రసవత్తరంగా సాగుతున్న వేళ, నిర్వాహకులు స్పీకర్ ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్‌లకు గౌరవార్థం కరాటే బ్లాక్ బెల్ట్‌ను ప్రదానం చేశారు.
వైసీపీ వర్సెస్ బీజేపీ.. యువ నేతల మాటల యుద్ధం..
తిరుపతిలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ భారతీయ జనతా పార్టీగా మారింది.. వైసీపీ, బీజేపీ యువ నేతల మాటల యుద్ధం నడుస్తోంది.. టీటీడీ పాలకమండలి సమావేశంలో తిరుపతి స్పోర్ట్స్ కాంప్లెస్ కు కోటి రూపాయల విడుదల చేయడంపై వివాదం మొదలైంది.. తిరుపతి పారిశుధ్య పనులకు టీటీడీ నిధులు కేటాయించినప్పుడు అడ్డుకున్న భానుప్రకాష్ రెడ్డి.. శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు నిధులు కేటాయింపుపై ఏ సమాధానం చెప్తారంటూ భూమన అభినయ్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.. అంతేకాదు.. టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డిని టార్గెట్ చేస్తూ అభినయ్ రెడ్డి అనుచరులు సోషల్ మీడియాలో వ్యక్తిగత పోస్టులు పెట్టడం ప్రారంభించారు.. ఇక, భాను ప్రకాష్ రెడ్డి పై వైసీపీ నేతల పోస్టులపై స్పందించిన భాను ప్రకాష్ రెడ్డి కుమారుడు పృథ్వి.. భూమన అభినయ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు.. కరుణాకర్ రెడ్డి కుటుంబం వందల కోట్లు ఎలా సంపాదించిందో తిరుపతి ప్రజలకి తెలుసు.. మా కుటుంబం 1960 నుండి వ్యాపారాలు చేస్తున్నాం, ఆర్థికంగా బలంగా ఉన్నాం.. మరి భూమన కుటుంబం ఏ వ్యాపారాలు చేసి కోట్లు సంపాదించారో చెప్పాలని సవాల్ చేశారు.
ఈ అవివేకపు విధానాన్ని వెంటనే విరమించుకోవాలి
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ట్విట్టర్ వార్ మొదలైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) రాష్ట్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా విమర్శిస్తూ ట్విట్టర్ వేదికగా ఓ కీలక వ్యాఖ్య చేశారు. “తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ అవివేకపూరిత నిర్ణయం వల్ల హైదరాబాద్ నగరం ఒక పెద్ద హరిత ప్రాంతాన్ని కోల్పోనుంది. కంచే-గచ్చిబౌళిలో 400 ఎకరాల భూమిని అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాను,” అని కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
అంతేకాదు, అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఒక ప్రకటనపై కూడా ఆయన స్పందించారు. “నిన్న అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి, ఆ భూమిలో ఎటువంటి జంతువులు లేవని తప్పుగా పేర్కొన్నారు. అయితే, విద్యార్థులు, అధ్యాపకుల సమాచారాన్ని ప్రకారం, హైదరాబాద్ విశ్వవిద్యాలయ (HCU) ప్రాంగణంలో 700కు పైగా పుష్ప వృక్ష జాతులు, 10 రకాల సస్తన ప్రాణులు (mammals), 15 రకాల సరీసృపాలు (reptiles), 200కి పైగా పక్షి జాతులు నివసిస్తున్నాయి. అంతేకాదు, అక్కడి శిలా నిర్మాణాలు ఏకంగా బిలియన్ సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నాయి” అని వివరించారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 2 శాతం డీఏ పెంపుకు క్యాబినెట్ ఆమోదం..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బీజేపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 2 శాతం డీఏ పెంపుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ పెంపుతో 53 శాతం నుంచి 55 శాతానికి డీఏ పెరగనుంది. ఈ పెంపు జనవరి1, 2025 నుంచి వర్తిస్తుంది. మొత్తంగా ఉద్యోగులు జీతాలు పెరకబోతున్నాయి. చివరిసారిగా కేంద్రం జూలై 2024లో డీఏని పెంచింది. ఆ సమయంలో 50 శాతం నుంచి 53 శాతానికి పెరిగింది.
డియర్‌నెస్ అలవెన్స్ (DA) అనేది ప్రభుత్వ ఉద్యోగులకు పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఇచ్చే భత్యం. ఏడాదికి రెండుసార్లు డీఏను పెంచుతారు. పెరిగిన జీవన వ్యయాల కారణంగా జీతాలు సర్దుబాటు చేయడానికి ఉద్దేశించబడింది. ప్రతీ 10 ఏళ్లకు ఒకసారి పే కమిషన్ ప్రాథమిక జీతాలను నిర్ణయిస్తుండగా, ద్రవ్యోల్బణాన్ని అనుగుణంగా డీఏ కాలానుగుణంగా సర్దుబాటు చేస్తుంటారు.