కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం గోపవరం పంచాయతీ ఉపసర్పంచ్ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. 20 మంది వార్డు మెంబర్లలో 14 మంది వైసీపీ, ఆరు మంది టీడీపీకి ఉన్నారు. ప్రస్తుతం ఉపసర్పంచ్ ఎన్నిక ఉత్కంఠగా సాగుతోంది. వైసీపీ వార్డు మెంబర్లను టీడీపీ నేతలు తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. దాంతో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ చెలరేగడంతో.. పోలీసులు ఇరవర్గాలను చెదరగొట్టారు. దీనిపై ఎంపీ అవినాష్ రెడ్డి స్పందించారు. జడ్పీ ఎన్నికల్లో టీడీపీ కుట్ర చేసే ప్రయత్నం చేసిందన్నారు.
‘జడ్పీ ఎన్నికల్లో టీడీపీ కుట్ర చేసే ప్రయత్నం చేసింది. మాకు బలం లేదు, పోటీ చేయడం లేదంటూనే.. కోర్టులో పిటీషన్ వేసి ఎన్నికలు అడ్డుకోవాలని చూశారు. కోర్టులో కూడా టీడీపీ అబాసుపాలైంది. మా పార్టీ జెడ్పీటీసీల సమిష్టి నిర్ణయంతోనే జడ్పీ చైర్మన్ ను ఎన్నుకున్నాం. గోపవరం పంచాయతీ ఎన్నికల్లో తమ సభ్యులను లోపలికి వెళ్ళనీకుండా అడ్డుకున్నారు. ఇంత తక్కువ టైంలోనే టీడీపీ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటుంది’ అని ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు.