MLC Kavitha: కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిపై బీఆర్ఎస్ పార్టీ సభ్యులు ప్రజల పక్షనా శాసన మండలిలో బలమైన వాయిస్ వినిపించారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, మిర్చి పంటకు మద్దతు ధర, పెళ్లి చేసుకునే ఆడ పిల్లలకు తులం బంగారంపై గట్టిగానే ప్రభుత్వాన్ని ప్రశ్నించామన్నారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి మహిళలను ఉద్దేశించి పరుష పదజాలలు ఉపయోగించారని పేర్కొనింది. ప్రభుత్వాన్ని ఎన్ని సార్లు నిలదీసిన వారి దగ్గర నుంచి కనీస సమాధానం కూడా రాలేదని చెప్పుకొచ్చింది. అలాగే, ఎమ్మెల్సీలుగా రిటైర్ అవుతున్న వారు.. ప్రజలకు పార్టీకి ఎంతో సేవ చేశారు అని ఎమ్మెల్సీ కవిత వెల్లడించింది.
Read Also: Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి మళ్లీ షాక్..
అయితే, ఎమ్మెల్సీగా రిటైర్ అయిన వారికి విరామం మాత్రమే కానీ విశ్రాంతి కాదు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చెప్పుకొచ్చింది. భవిష్యత్ లో వీరి సేవలను కేసీఆర్ తప్పకుండా వినియోగించుకుంటారు.. వచ్చే నెల బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు జరగబోతున్నాయి.. ఈ సందర్భంగా వరంగల్ ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం.. ఇప్పటి వరకు ఏ పార్టీ నిర్వహించని అంత పెద్దగా ఈ సభా ఉండబోతుంది.. కుంభమేళాను తలపించేలా ఈ సభ జరగనుంది.. ఏర్పాట్లు ఇప్పటికే మొదలు అయ్యాయి.. 10 లక్షల వాటర్ బాటిల్స్, 15 లక్షల మజ్జిగ ప్యాకెట్లు తెస్తున్నాం.. ఇది చూస్తేనే చాలు ఎంత పెద్దగా చేస్తున్నామో అర్థం అవుతుంది.. వరంగల్ లో జరిగే బహిరంగ సభకు భారీ ఎత్తున హాజరవ్వాలని ఎమ్మెల్సీ కవిత తెలిపింది.