KTR : తెలంగాణ అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించడం లేదని, బడ్జెట్‌లో రాష్ట్రానికి ప్రస్తావన కూడా లేకపోవడం బాధకరమని అన్నారు. కేంద్ర మంత్రులు వరుసగా రాష్ట్రానికి వస్తున్నా, బడ్జెట్‌లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని ఆక్షేపించారు. కేంద్ర మంత్రుల పర్యటనలకు ఖర్చు చేయాల్సిన అవసరం రాష్ట్రానికి లేకపోయినా, ఆ ఖర్చును తెలంగాణ అభివృద్ధికి ఉపయోగించివుంటే మేలు జరిగేదని అభిప్రాయపడ్డారు.
ప్రధాని మోడీ చేసిన “తల్లిని చంపి బిడ్డను బతికించారు” అన్న వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఖమ్మం జిల్లాలో ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన తీరును తప్పుబట్టారు. పసుపు బోర్డుకు కేంద్ర బడ్జెట్‌లో కనీసం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని విమర్శించారు కేటీఆర్. కుంభమేళాకు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన కేంద్రం, తెలంగాణ సంస్కృతిని గుర్తించడానికి ఏమాత్రం ఆసక్తి చూపడం లేదని ఆరోపించారు. సమ్మక్క-సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని డిమాండ్ చేశారు.
ప్రధాని మోడీ రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, ముఖ్యమంత్రి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇద్దరూ ఆ హామీలను నిలబెట్టుకోలేదని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాలా తీసినట్లు ప్రభుత్వం చెప్పుకోవడం సరికాదని వ్యాఖ్యానించారు. ఉద్యోగుల జీతాలు ఆలస్యమవుతున్న నేపథ్యంలో, రాష్ట్ర ఆర్థికంగా బలంగా ఉంటే జీతాల జాప్యం ఎందుకు జరుగుతోందని ప్రశ్నించారు. సర్పంచులు బిల్లుల కోసం ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.
సభలో ఆసక్తికరంగా జరిగిన ఓ సంఘటనలో కేటీఆర్ ముందుగా.. ఈ సభలో అప్పులేని వాళ్లు ఉన్నారా..? అందరికీ అప్పులు ఉన్నాయి… అంటూ వ్యాఖ్యానించగా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క “నాకు అప్పులేదు” అని చెప్పారు.. దీంతో వ్యంగ్యంగా “మీరు గ్రేట్ భట్టి అన్న” అంటూ స్పందించిన కేటీఆర్. “ఆర్థిక శాఖ మంత్రి కదా, అలాగే ఉండాలి” అని మరింతగా సెటైర్ వేశారు.
Shruti Hassan : ఆయన్ని చూసి చాలా విషయాలు నేర్చుకున్న