KTR : ఆయనకు ఫ్రస్టేషన్ తగ్గట్లేదు.. నేను శాశ్వతంగా రాజకీయాలు వదిలేస్తా.. కేటీఆర్ సంచలనం
- తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్
- మాటల యుద్ధంతో హీట్ పెంచిన నేతలు
- రుణమాఫీపై కేటీఆర్ సవాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR : చివరి రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. అసెంబ్లీ సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ అన్నట్లు మాటల యుద్ధం నడుస్తోంది. గత ప్రభుత్వం తనపై కక్ష కట్టి ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురిచేసిందని సీఎం రేవంత్ రెడ్డి ఉగ్రరూపం చూపించారు. అనంతరం కేటీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డికి ఫ్రస్టేషన్ ఎందుకో అర్థంకావడంలేదు అని ఆయన అన్నారు. ఆయన సీఎం సీటులో కూర్చుంటా అన్నాడు.. కూర్చున్నా కూడా కూల్ కావడం లేదంటూ సెటైర్ వేశారు కేటీఆర్. ఎన్నికల ముందు రైతులకు రైతుబంధు ఇవ్వదంటూ.. ఎన్నికల కమిషన్ లేఖ రాసింది అప్పటి పీసీసీగా రేవంత్ రెడ్డినే అని ఆయనఅన్నారు. ఇప్పుడు మేము రైతుబంధు అపాం అని నిందలువేస్తున్నామన్నారు.. కావాలంటే.. ఆయన ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన లేఖ కాపీ నాదగ్గర ఉంది ప్రూఫ్ చూడండని ఆయన అన్నారు. ప్రతి సారి రుణమాఫీ అంటారు.. ఏ ఒక్కగ్రామంలోనైనా వందశాతం రుణమాఫీ అయితే నేను శాశ్వతంగా రాజకీయాలకు దూరంగా ఉంటా అని సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. కొండారెడ్డిపల్లి పోదామా.? లేకుండా.. సిరిసిల్ల పోదామా..? అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు.
వందరోజుల్లో తులం బంగారం అని ఎవరు చెప్పమన్నారు. ప్రజలు లంకె బిందెల కోసం ఎదురుచూడాలా..? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఆయన స్వాతంత్ర్య ఉద్యమం చేసి జైలుకు వెళ్లారా.. మేము కూడా జైలుకు వెళ్లాం.. ముఖ్యమంత్రి హుంకరిస్తున్నారు.. నేను అనుకుంటే అక్కడ ఎవరు ఉండరని అంటున్నారు.. మీరుం ఏం అనుకున్నా ఏం కాదు. చెన్నై సమావేశంలో సీఎంను నేను సమర్థిస్తూ మాట్లాడాను.. పరిపాలన అంటే పంచ్ డైలాగ్‌లు కాదు. కక్షసాధింపు లేదంటున్నారు, మా పథకాలను ఎందుకు రద్దు చేశారు అని కేటీఆర్ అన్నారు. ఫార్మాసిటీ వద్దన్నారు, ఫార్మావిలేజ్‌లన్నారు. లగచర్లలో 9నెలలు రైతులు ధర్నా చేస్తే పట్టించుకోలేదన్నారు. అధికారులను రైతులు అడ్డుకుంటే అదిమాకు ఆపాదిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
Also Read
- Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
- Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
- Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
Infinix Note 50x 5G+: పిచ్చెక్కించే ఫీచర్లతో.. ఇన్ఫినిక్స్ కొత్త ఫోన్ విడుదల.. ధర తక్కువే
తాజావార్తలు
-
Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
-
Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
-
Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
-
Nara Lokesh : పార్టీ లైన్ దాటొద్దు.. నేతలకు లోకేష్ కీలక సూచన
-
Prabhas’ Fauzi: నెల రోజుల పాటు ప్రభాస్ ‘ఫౌజీ’ క్లైమాక్స్ వార్.. ఇక మిగిలింది రెండే ఫైట్లు!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!