నిజాం..ఖాసీం రిజ్వీ లాంటి కేసీఆర్..హరీష్‌కు బుద్ధి చెప్పాలి: రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజురాబాద్ బైపోల్‌లో ప్రత్యర్థుల మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్‌కు మద్దతుగా ప్రచారంలో కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యర్థి పార్టీల నాయకులపై తీవ్రమైన మాటల దాడి చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నిజాం నవాబు… అధిపత్యం కోసం రజాకార్ల ను నియమించుకున్నారు . కేసీఆర్ నిజాం అయితే..ఖాసీం రిజ్వి హరీష్ రావు తన పెత్తనం నిలబెట్టుకోవడానికి నిజాం లాంటి కేసీఆర్…హరీష్ రావు ను ఖాసిం రజ్వీ లెక్క మార్చేశారు. హుజురాబాద్ లో వ్యాపారులను, నిరుద్యోగులను, ఫీల్డ్ అసిస్టెంట్లను హరీష్‌రావు బెదిరిస్తున్నారన్నారు. చిల్లర రాజకీయాలకు తెర లేపి..ఖాసిం రీజ్వినీ తలపిస్తున్నడు హరీష్‌రావు అని రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పోలీస్ శాఖలో స్పిట్ వచ్చిందని, పోలీసు శాఖ రెండుగా చీలిపోయింది రాష్ట్ర డీజీపీ ఫోన్ కూడా ట్యాప్ అవుతుంది. ప్రభాకర్ రావుకి ప్రభుత్వం అప్పగించిన రెండు పనుల్లో రేవంత్… డీజీపీ ఫోన్ ట్యాప్ చేయడమే ఆయన పని అని రేవంత్ అన్నారు. రిటైర్డ్ అయినా DSP వేణు గోపాల్ రావు..వద్ద 32 మందితో నిఘా పెట్టారు. డీజీపీ మీద నర్సింగ్ రావుని నిఘా పెట్టారు డీజీపీ కూడా భయం భయం గా బతుకుతున్నారు .IPS లో ఓ సామాజిక వర్గం నీ దొంగలా చూస్తున్నారు. ఆ సామాజిక వర్గం IPS లు… మాకు పోస్టింగులు వద్దు అనే పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు.
Also Read
- VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
- OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
- Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
- Off The Record: వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతల్లో నర్సంపేట టెన్షన్ .. ఎందుకంటే ?
తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఇలాంటి నిఘా లేదు. రిటైర్డ్ అయిన కొందర్ని స్వంతంగా పెట్టి వ్యవస్థలను నడిపిస్తున్నారు. సిటీ చుట్టూ ముట్టు తన వారికే పోస్టింగులు వేశారు. పోలీసు శాఖ లో రెండు సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తత వాతావరణం ఉంది ఏపీకి చెందిన కేసీఆర్ బంధువునీ డిప్యూ టేషన్ మీద తెప్పించి అవసరం ఉందా..? అని రేవంత్ వ్యాఖ్యానించారు.
హుజూరాబాద్ ఎన్నికల ప్రచారానికి రేవంత్ రాలేదు అని టీఆర్ఎస్ అంటుందని
మరి కేసీఆర్ ఏం చేస్తున్నారు డ్రగ్స్..సుగంధాల పై సమీక్షలు, ఇక కేటీఆర్… ప్లీనరీ పేరుతో వంటకాలు చేస్తున్నారు. కవితమ్మ…బెంజ్ కారు..బతుకమ్మతో బూర్జ్ ఖలీఫా మీద బతుకమ్మ ఆట- పాట, ఖాసీం రిజ్వీకి ఇక్కడ ఎదురు వచ్చినోడి నాలుకలు కోస్తున్నరు. నలుగురు నాలుగు తీర్లు ఉన్నారు.ప్రజల కోసం ఎప్పుడైనా కోట్లాడేది కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని తెలంగాణ బాగోగులు బాధ్యత మాది ఎందుకంటే…తెలంగాణ ఇచ్చింది మేము అని రేవంత్‌రెడ్డి అన్నారు.
- Tags
- bjp
- congress
- harish rao
- kcr
- ktr
తాజావార్తలు
-
AP Local Body Elections 2026: నేడు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
-
Explainer: యువత ఆరోగ్యానికి “రాజకీయ” గండం.. వీడియోలు, వార్తలతో మనశ్శాంతి కోల్పోతున్న యూత్..!!
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
ట్రెండింగ్
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం