20 ఏళ్ల విజయోత్సవాలు నిర్వహించడం సిగ్గు చేటు: ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బహుజనుల స్వయం పాలన ప్రతిజ్ఞ సభకు హాజరైన ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ అధికార టీఆర్‌ఎస్ పై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో లక్షలాది నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టి టీఆర్ఎస్ 20 ఏళ్ల విజయోత్సవాలు నిర్వహించుకోవడం సిగ్గుచేటన్నారు. ఏడేళ్ల టీఆర్ఎస్ పాలనలో ప్రజలకు గొర్లు, బర్లు, చేపలు పంపిణీ చేస్తూ బీసీలను కులవృత్తులకు పరిమితం చేస్తున్నందుకా, టీఆర్‌ఎస్ విజయోత్సవాలు నిర్వహించేది ఎందుకని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.
వందలాది మంది విద్యార్థి అమరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయిందన్నారు. గడిచిన ఏడేళ్లలో రాష్ట్రంలో లక్షలాది నిరుద్యోగులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని, రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలనలో నియంతృత్వం పెరిగి పోయిందన్నారు. హైదరాబాద్‌లో అనుమతులు లేకుండా టీఆర్‌ఎస్ ప్లీనరీకి భారీ కటౌట్ల ఏర్పాటు చేశారని, ఎవరికి జరిమానా విధించారో కేటీఆర్ చెప్పాలని ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు.
Also Read
- Tags
- hyderabad
- kcr
- ktr
- Praveen Kumar
- TRS
తాజావార్తలు
-
Udhampur Anti-Terror Operation: ఉధంపూర్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
-
Irummudi Collections: ఒక్క అడుగు దూరంలో ‘ఇరుముడి’.. ఆ మార్క్ సాధ్యమేనా?
-
Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన తహసీల్దార్..
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్‌కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
ట్రెండింగ్
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!