ఫ్రాన్స్ పర్యటనలో కేటీఆర్ బిజీబిజీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫ్రెంచ్ ప్రభుత్వం ఆహ్వానం మేరకు ఫ్రాన్స్ వెళ్లిన తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బిజీగా గడిపేస్తున్నారు.. నాలుగు రోజుల పాటు ఈ పర్యటన కొనసాగనుండగా.. ప్యారిస్‌లో జరగనున్న సమావేశాల్లో కేటీఆర్ బృందం పాల్గొననుంది.. ఇక, ఫ్రాన్స్ పర్యటన తొలిరోజున మంత్రి కేటీఆర్ ఫ్రెంచ్ ప్రభుత్వ డిజిటల్ అఫైర్స్ అంబాసిడర్ హెన్రీ వర్డియర్‌తో సమావేశం అయ్యారు. ఇన్నోవేషన్, డిజిటలైజేషన్, ఓపెన్ డేటా వంటి ఫ్రాన్స్, తెలంగాణ మధ్య పరస్పర సహకారం అందించుకునే అవకాశం గురించి ఈ సమావేశంలో చర్చించారు.
తెలంగాణ రాష్ట్రంలో ఇన్నోవేషన్, అంకుర సంస్థలను ప్రోత్సహించడానికి జరుగుతున్న వివిధ కార్యక్రమాల గురించి, ఓపెన్ డేటా పాలసీ గురించి, రాష్ట్రంలో నిర్మాణం అవుతున్న డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గురించి మంత్రి కేటీఆర్ అంబాసిడర్ హెన్రీ వర్దియర్ కు వివరించారు. అటు తెలంగాణలోని అంకుర సంస్థలకు ఫ్రాన్స్ లో, ఇటు ఫ్రాన్స్ లోని అంకుర సంస్థలకు తెలంగాణలో వ్యాపార, వాణిజ్య అవకాశాలు కల్పించడం గురించి కూడా వివరమైన చర్చ జరిగింది. సమావేశంలో ఫ్రాన్స్ లో భారత డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ కేఎం ప్రఫుల్ల చంద్ర శర్మ, తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజాన్, డైరెక్టర్ డిజిటల్ మీడియా దిలీప్, డైరెక్టర్ ఏవియేషన్ ప్రవీణ్ పాల్గొన్నారు. ఇక, ఫ్రాన్స్ ఆహ్వానం మేరకు వెళ్లిన మంత్రి కేటీఆర్.. ఈనెల 29న యాంబిషన్ ఇండియాలో కీలకోపన్యాసం చేయనున్నారు. కోవిడ్ అనంతరం భారత్-ఫ్రెంచ్ సంబంధాలు – అభివృద్ధి అనే అంశంపై కేటీఆర్ తన అభిప్రాయాలు పంచుకోనున్నారు.. రెండు దేశాలకు చెందిన 700 మందికి పైగా పారిశ్రామిక, వాణిజ్య వేత్తలు, 400కు పైగా కంపెనీల అధిపతులు, ప్రతినిధులు పాల్గొనే ఈ సమావేశాన్ని కీలకంగా భావించిన కేటీఆర్.. ఈ పర్యటనకు వెళ్లారు.
Also Read
తాజావార్తలు
-
Supreme Court: సీజేపీకి సుప్రీంకోర్టులో ఊరట.. తిరంగా మార్చ్‌పై తక్షణ ఆదేశాలకు నిరాకరణ!
-
TDP vs YCP: పుంగనూరులో ఉద్రిక్తత.. వైసీపీ శ్రేణులపై టీడీపీ కార్యకర్తల రాళ్ల దాడి!
-
Punam Raut Retires: “చాలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నా”.. రిటైర్మెంట్ ప్రకటనపై పూనమ్ భావోద్వేగం..
-
Gujarat: పాకిస్థాన్‌కు చెందిన 319 మందికి భారత పౌరసత్వం.. శరణార్థుల కన్నీటి పర్యంతం..
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
ట్రెండింగ్
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!