Off The Record: ఫార్ములా ఈ-రేస్ కేసు వెనక రాజకీయ వ్యూహం ఉందా? బీఆర్ఎస్ ఆలోచన ఏంటి..?
- సిట్టింగ్ సీటును నిలబెట్టుకోవాలని కసిగా బీఆర్‌ఎస్..
- రెగ్యులర్‌గా సమీక్షిస్తున్న కేటీఆర్..
- ఫార్ములా ఈ కేసు మరోసారి తెర మీదికి రావడంపై చర్చ..
- కేటీఆర్‌కు చెక్ పెట్టడానికేనని అనుమానిస్తున్న బీఆర్‌ఎస్..
- ఒకటి రెండు నెలల్లో ఉప ఎన్నిక నోటిఫికేషన్‌కు ఛాన్స్..
- ప్రచారంలో పాల్గొనకుండా కేటీఆర్‌ని కట్టడి చేసే ప్లాన్ అని గులాబీ డౌట్స్..
- కేటీఆర్ సీన్‌లో లేకుంటే నెగెటివ్ అవుతుందన్న భయం..
- ప్రత్యామ్నాయ మార్గాలను కూడా బీఆర్‌ఎస్ చూస్తోందా?..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీద హాటు ఘాటు చర్చలు నడుస్తున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చనిపోవడంతో ఇక్కడ బైపోల్ తప్పలేదు. వచ్చే రెండు మూడు నెలల్లో ఎన్నిక జరిగే అవకాశం ఉంది. అందుకోసం అన్ని పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. సిట్టింగ్ సీటుగా బీఆర్‌ఎస్‌కు, రాష్ట్రంలో అధికారంలో ఉన్నందున కాంగ్రెస్‌కు ఇది ప్రతిష్టాత్మకంగా మారింది. ఎలాగైనా జూబ్లీహిల్స్‌ను తిరిగి దక్కించుకోవాలన్న ప్లాన్‌తో… ముందే ఇన్ఛార్జ్‌లను నియమించి పక్కాగా వ్యవహరిస్తోంది గులాబీ పార్టీ. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్… ఈ నియోజకవర్గం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి రెగ్యులర్‌గా సమీక్షిస్తున్నారట. సరిగ్గా… ఇదే టైంలో ఫార్ములా ఈ రేసు మరోసారి తెర మీదికి రావడం చర్చనీయాంశం అయింది. ఆ రూపంలో… కాంగ్రెస్ పార్టీ కేటీఆర్‌కు చెక్ పెట్టబోతోందా అని మాట్లాడుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. అటు బీఆర్‌ఎస్‌లో కూడా ఇదే తరహా చర్చ జరుగుతోందట. ఇప్పుడున్న పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం గెలుపు బీఆర్ఎస్‌కు అత్యంత అవసరం.. అందుకే కేటీఆర్ డైరెక్ట్ గా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారన్నది పార్టీ మాట.
Read Also: Minister Nara Lokesh: జగన్ వ్యాఖ్యలకు మంత్రి లోకేష్ కౌంటర్..
Also Read
ఇలాంటి సమయంలో తమను డిస్టర్బ్ చేయడానికే కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి ఫార్ములా ఈ కేసును తెర మీదకి తెచ్చిందని అంటున్నారు బీఆర్‌ఎస్ నాయకులు. ఈ కేసు పేరుతో కేటీఆర్‌ని తీవ్రస్థాయిలో ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారట గులాబీ లీడర్స్. గతంలో విచారణల పేరుతో వరుసగా కేటీఆర్‌ని పిలిచారని, అదే ప్రక్రియ మరోసారి జరుగుతుందేమోనని అనుమానిస్తున్నారు పార్టీ నాయకులు. రాబోయే ఒకటి రెండు నెలల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి… ఆ టైంకి కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా కట్టడి చేసే ప్లాన్ ఉందన్నది వాళ్ళ అభిప్రాయంగా తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని చెబుతున్నారు బీఆర్ఎస్ లీడర్స్. జూబ్లీహిల్స్‌ను గెలవడం ద్వారా… తమ వాదన కరెక్టేనని చెప్పాలన్నది వాళ్ళ ఆలోచన.
Read Also: TG News: రైతులకు గుడ్‌న్యూస్.. సాదాబైనామాలపై నోటిఫికేషన్ విడుదల
అయితే…వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రచారం చేయకుండా, దీనిమీద దృష్టి సారించలేకపోతే… నెగటివ్ రిజల్ట్ వచ్చే ప్రమాదం ఉందని కూడా లెక్కలేసుకుంటున్నారు కారు పార్టీ లీడర్స్. అందుకే… ఒకవేళ కేటీఆర్ స్వేచ్ఛగా ప్రచారం చేయలేని పరిస్థితి వస్తే… ప్రత్యామ్నాయం ఏంటో… ఇప్పటినుంచే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే డివిజన్ల వారీగా ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను ఇన్చార్జిలుగా నియమించింది పార్టీ. ప్రస్తుతానికి వారం వారం సమీక్షిస్తున్నా… ముందు ముందు ప్రతిరోజు సమీక్షిస్తానని ప్రకటించారు కేటీఆర్. ఒకవేళ ఫార్ములా ఈ కేసులో ఆయన బిజీ అయి డైలీ సమీక్షలు చేయలేని పక్షంలో లీడర్స్ డీలా పడకుండా జాగ్రత్తలు తీసుకోబోతున్నారట. మొత్తం మీద జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు, ఫార్ములా ఈ కేసుకు ముడిపెట్టి బీఆర్‌ఎస్ వర్గాల్లో హాట్ హాట్‌గా చర్చలు జరుగుతున్నాయి.
తాజావార్తలు
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!