KTR : తెలంగాణలో గ్రూప్-1 పరీక్ష రద్దు, కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ (ట్విట్టర్)లో ఒక పోస్ట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల నమ్మకాన్ని వమ్ము చేసిందని ఆయన ఆరోపించారు. “సర్కారు కొలువుకోసం ఏళ్ల తరబడి కష్టపడి, తమ విలువైన సమయాన్నీ, అమ్మానాన్నల కష్టార్జితాన్నీ ధారపోసి పోటీ పరీక్షలు రాసే తెలంగాణ యువత నమ్మకాన్ని ఈ కాంగ్రెస్ సర్కార్ వమ్ము చేసింది” అని కేటీఆర్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థత, కాసుల కక్కుర్తి కలగలిసి అనేక అవకతవకలకు కారణమయ్యాయని, “అంగట్లో కొలువులు అమ్ముకొని నిరుద్యోగుల గొంతుకోసింది” అని ఆయన విమర్శించారు.
Rains : మెదక్‌లో మరోసారి భారీ వర్షం.. హైవేపై వరద, స్థానికులకు తీవ్ర ఇబ్బందులు
గ్రూప్-1 పరీక్ష నిర్వహణలో విఫలమైన ఈ ప్రభుత్వాన్ని యువత ఎన్నటికీ క్షమించదని కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన రెండు ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం గ్రూప్-1 పరీక్షను మళ్ళీ నిర్వహించాలి. అవకతవకలపై జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేసి ఉద్యోగాల దొంగలెవరో తేల్చాలి. కేవలం ఏడాదిలోపే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ చేసిన “మోసపూరిత వాగ్ధానం”పై ప్రత్యేక అసెంబ్లీ సెషన్ ఏర్పాటు చేసి చర్చించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
Lokesh Aamir Film : కూలీ ఎఫెక్ట్.. అమీర్ ఖాన్.. లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్