Jagadish Reddy: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. మీరు పార్టీ మారకపోతే, పార్టీ నాయకత్వంపై విశ్వాసం ఉంటే అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరకు రావాలి.. లేదంటే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వద్దకు అయినా రావాలి.. కానీ, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు రాగానే సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి ఎందుకు వెళ్ళినారు అని జగదీష్ రెడ్డి ప్రశ్నించారు.
Read Also: Medak : మెదక్‌లో చిరుతతో పోరాటం, ధైర్యంగా పశువులను కాపాడిన గొర్రెల కాపరి
ఇక, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన 10 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ పై ఒత్తిడి పెట్టి సాంకేతికంగా తప్పించుకోవాలని ప్రయత్నించినా.. ప్రజల నుంచి మాత్రం తప్పించుకోలేరు అని ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. అలాగే, ప్రజా క్షేత్రంలో మీకు శిక్ష తప్పదు అని విమర్శించారు. ప్రజల దృష్టిలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు ద్రోహులుగా మిగిలిపోతారని చెప్పుకొచ్చారు. స్పీకర్ ప్రసాద్ కుమార్ సరైన నిర్ణయం తీసుకుంటే మంచిది.. లేదంటే, కోర్టు ద్వారా న్యాయం జరుగుతుంది అని పేర్కొన్నారు.