Krishna Water: కృష్ణా నీటిపై రెండు రాష్ట్రాల రగడ.. వాటా ఖరారు చేయాలని తెలంగాణ డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Krishna Water: కృష్ణాజలాల గురించి చాలా కాలంగా సమస్యలు ఉన్నాయి. నీటి వినియోగానికి సంబంధించి వాస్తవంగా దక్కాల్సిన వాటా తమకు దక్కడం లేదని తెలంగాణ రాష్ట్రం వెల్లడించింది. ఈ క్రమంలోనే ఈ ఏడాదికి సంబంధించి కృష్నా జలాల వాడకం పై కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు ముందు పలు డిమాండ్‌లను ఉంచింది. ఇందులో ఒకటి ఈ ఏడాదికి సంబంధించి ఏపీ, తెలంగాణల కృష్ణా జలాల వినియోగాన్ని లెక్కించింది. కృష్ణా జలాల నీటిని రెండు రాష్ట్రాలు వాస్తవంగా వినియోగాన్ని నిర్ణయించాలని కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డును తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేసింది.
Read also: Flyovers Shutdown: నేడే మహా శివరాత్రి, షబ్ ఈ మేరజ్.. నగరంలోని ఫ్లై ఓవర్లు బంద్
Also Read
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
- Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
ప్రస్తుత నీటి సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కృష్ణా నీటి వినియోగాన్ని లెక్కించి రెండు రాష్ట్రాల వాస్తవ నీటి వినియోగాన్ని నిర్ణయించాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కెఆర్‌ఎంబి)ని కోరింది. శుక్రవారం కేఆర్‌ఎంబీ త్రిసభ్య కమిటీ ముందు తెలంగాణ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ ప్రభుత్వ వాదనలు వినిపించారు. రెండు రాష్ట్రాలు నీటి వినియోగాన్ని లెక్కించడం ద్వారా ప్రతి ఒక్కరు వాస్తవంగా ఎంత నీటిని ఉపయోగించారు, ఎంత ఉపయోగించాల్సి ఉందో తెలుస్తుందని చెప్పారు. నీటి వినియోగంలో తెలంగాణకు సరైన వాటా రావడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుత సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే తన కోటా కంటే ఎక్కువగా కృష్ణా నీటిని వినియోగించుకుందని ఇరిగేషన్ అధికారి బోర్డు దృష్టికి తీసుకొచ్చారు.
Read also: SR Nagar Robbery: ఎస్‌ఆర్ నగర్ చోరీ కేసులో ట్విస్ట్.. ఆభరణాల దొంగ అతనే..
తెలంగాణకు ఇంకా 141 టీఎంసీలు వినియోగించుకునే అవకాశం ఉండగా, తెలంగాణ వాదనల అనంతరం ఆంధ్రప్రదేశ్ ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి గైర్హాజరు కావడంతో కమిటీ సమావేశాన్ని వాయిదా వేసింది. తదుపరి సమావేశం మార్చిలో జరిగే అవకాశం ఉందని కమిటీ సభ్యులు తెలిపారు. అయితే..కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ అధికంగా వాడుకుంటున్న విషయాన్ని తెలంగాణ లేవనెత్తుతోందని.. మరిన్ని కేటాయింపులతో భర్తీ చేయాలని డిమాండ్ చేసింది. తెలంగాణ వాదనలను ఆంధ్రప్రదేశ్ ఖండించింది. కేటాయింపుల్లో మార్పులు చేయాలని డిమాండ్ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య 50:50 శాతం కృష్ణా జలాలను కేటాయించాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. అదే సమయంలో ఈ నిష్పత్తిని 70:30 శాతానికి సవరించాలని ఏపీ పట్టుబట్టింది. కాగా, మార్చిలో జరిగే కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కేఆర్‌ఎంబీ) సమావేశంలో దీనిపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే.. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి విద్యుత్, నీటిని పంచుకునే విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. గతేడాది డిసెంబర్ లో కృష్ణా జలాలపై కేఆర్‌ఎంబీ ఆలోచనను తెలంగాణ ప్రభుత్వం తిరస్కరించిన సంగతి తెలిసిందే.
Rajanna Temple: రాజన్న ఆలయానికి హెలికాప్టర్ సేవలు.. చెరువు ప్రాంతంలో దిగేందుకు..
తాజావార్తలు
-
VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
-
Don’t Trouble The Trouble: రాజమౌళికి బిగ్ షాక్
-
Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి ‘నో’ చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Matsya: పడవ కింద నుంచి వెళ్లిన ‘మిథికల్ ఫిష్’.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ ‘మత్స్య’!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!