Palamuru Rangareddy Lift Irrigation Project: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకుంటూనే ఉన్నారు.. ఇప్పుడు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు లేఖ రాసింది ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ ఈఎన్సీ… పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు డీపీఆర్ ఇవ్వాలని లేఖలో కేఆర్ఎంబీని కోరింది… విభజన చట్టానికి వ్యతిరేకంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానం జరుగుతోందని ఆక్షేపించింది.. కృష్ణా బేసిన్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న అనుమతి లేని ప్రాజెక్టులపై కేఆర్‌ఎంబీకి ఫిర్యాదు చేసింది ఆంధ్రప్రదేశ్.. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం కేఆర్ఎంబీ, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ఏ కొత్త ప్రాజెక్టునూ నిర్మించేందుకు వీల్లేదని స్పష్టం చేసింది.. పాలమూరు రంగారెడ్డి డీపీఆర్‌ను కేఆర్ఎంబీకి సమర్పించినట్టుగా 2022 సెప్టెంబర్ 3 తేదీన జరిగిన దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశంలో తెలంగాణా పేర్కొందని.. లేఖలో ప్రస్తావించింది.. అయితే, ఈ ప్రాజెక్టుపై అభ్యంతరాలు, అభిప్రాయాలను తెలిపేందుకు డీపీఆర్ కాపీ ఇవ్వాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డును కోరింది ఆంధ్రప్రదేశ్.
Read Also: CM KCR : తెలంగాణ సర్కార్ తీపికబురు.. మరోసారి కంటి వెలుగు కార్యక్రమం