హరీశ్ రావు లాగా పెట్రోల్ ముందు పోసుకున్నట్లు నటించి వేరే వాళ్ల చావుకు కారణం కాలేదని, పోసుకుని చచ్చిపోతా అని నాటకాలు ఆడలేదన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యమ సమయంలో కూడా వాళ్ళు అందరూ బ్లాక్ మైలర్స్ గా ఉన్నారని, ఆ బ్లాక్ మెయిల్ వివరాలు కూడా బయట పెట్టాల్సి వస్తదన్నారు. తెలంగాణ రావడానికి మూల కారణం… ఆల్ పార్టీ లో కేంద్రాన్ని ఒప్పించింది ఉత్తమ్ కుమార్ రెడ్డే. అవిషయం నీకు తెలియక పోతే మీ మామ కేసీఆర్ ను అడుగు అని ఆయన వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ పది ఏండ్ల పాలనలో అవినీతి తప్ప ప్రజలకు చేసింది ఏమి లేదని, బీఆర్ఎస్ చేసిన తీసుకున్న నిర్ణయాల వలన తెలంగాణకి అన్యాయం జరుగుతూ వచ్చిందన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. నీటి పంపకాల విషయంలో krmb బోర్డు నీటి వాటాను పంచుతూ తెలంగాణ కి అన్యాయం చేస్తుంటే బీఆర్‌ఎస్ ఏమి చేసిందని ఆయన ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్ట్ ల అప్పగింత పై నిర్ణయం జరిగిందని ఆయన అన్నారు. చివరగా బీఆర్‌ఎస్ వాళ్ళు అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో కూడా krmb కి 200 కోట్లు కేటాయిస్తున్నట్లు బడ్జెట్ లో పేర్కొన్నారని, మేము ప్రాజెక్ట్ లను అప్పగించలేదు..కావాలని బీఆర్‌ఎస్ వాళ్ళు అబద్ధాలు చెపుతున్నారన్నారు.
అంతేకాకుండా.. ‘జగన్, కేసీఆర్ కలిసి తెలంగాణకి కుట్ర చేశారు… 203 జీవో తీసుకువచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కు కృష్ణ నీళ్ళు దొంగలించుకుని వెళ్ళారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కి ఎస్టిమేషన్ పెంచారు కానీ ఒక్క ఎకరాకు కూడా నీళ్ళు ఇవ్వలేదు. బీఆర్‌ఎస్ వాళ్ళు పది ఏండ్లు అధికారంలో ఉన్న కృష్ణ నది పరివాహక ప్రాంతలలో ఉన్న ఒక్క పెండింగ్ ప్రాజెక్ట్ లను పూర్తి చేయలేదు. జగన్ తో కేసీఆర్ కుమ్మక్కై కృష్ణ నది నుండి తెలంగాణకు గ్రావిటీ ద్వారా రావాల్సిన 8 tmc లను ఏపీ కి అప్పగించాడు. 95,000 ఖర్చు పెట్టి కాళేశ్వరం కట్టారు..ఒక్క బ్యారేజ్ కూలి పోయింది.. రెండో బ్యారేజ్ కూలడానికి రెడీ గా ఉంది.. బీఆర్‌ఎస్ వాళ్ళు కమిషన్ ల కోసం అవినీతి చేయడానికి ప్రాజెక్ట్ లు కట్టారు.. మేము ప్రాజెక్ట్ లు ఎవరికి అప్పచెప్పము.మా ప్రభుత్వం పై కావాలని brs వాళ్ళు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. మేము ప్రాజెక్ట్ లను ఎవరికి అప్పచెప్పము..ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి కూడా చెప్పాము.. హరీష్ రావు లాగా మేము పెట్రోల్ పోసుకుని నటించలేదు…వాళ్ల లాగా మేము బ్లాక్ మెయిలర్ లము కాదు.. తెలంగాణ రావడానికి ఒక కారణం ఉత్తమ్ కుమార్ రెడ్డి ..ఆ విషయాన్ని మీ మామ ను అడుగి తెలుసుకో.. జగన్ కెసీఆర్ మాట్లాడుకుని తెలంగాణ లో ఎన్నికలను ప్రభావితం చేయడానికి నాగార్జున సాగర్ మీదికి ఏపీ ఫోర్స్ ను పంపారు.. అసెంబ్లీ కంటే ముందు టైం ఉంటే అఖిల పక్షం పెట్టాలని అనుకున్నాము కానీ టైమ్ లేక అఖిల పక్షం పెట్టడం లేదు..’ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.