MLC Kavitha: ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచితే సీఎం రేవంత్ సొంత జిల్లాకు చుక్క నీరు కూడా రాదు..
- ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచితే సీఎం రేవంత్ సొంత జిల్లాకు చుక్క నీరు కూడా రాదు
- దక్షిణ తెలంగాణ లోని ఐదు జిల్లాలకు కృష్ణానది వర ప్రదాయిని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తును 519 అడుగుల నుంచి 524 అడుగులకు పెంచేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచితే తెలంగాణకు జరిగే నష్టంపై ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచితే సీఎం రేవంత్ సొంత జిల్లాకు చుక్క నీరు కూడా రాదని చెప్పారు. దక్షిణ తెలంగాణ లోని ఐదు జిల్లాలకు కృష్ణానది వర ప్రదాయిని అని అన్నారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఆల్మట్టి హైట్ పెరగకుండా జీవో ఉందని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం 5 మీటర్ల ఎత్తు పెంచడానికి సిద్ధం అవుతుందన్నారు. తెలంగాణ కు కృష్ణానది ఆనవాళ్లు లేకుండా పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read:CM Revanth Reddy: నేడు బీసీ రిజర్వేషన్ లపై సీఎం రేవంత్ సమావేశం..
Also Read
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
- Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
- CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
అలా చేస్తే మన పొలాల్లో క్రికెట్ ఆడటానికి తప్ప దేనికి కూడా పనికి రాదని అన్నారు. సీఎం సొంత జిల్లా పాలమూరు కు ఒక్క చుక్క నీరు రాకుండా పోతుందని తెలిపారు. కర్ణాటక లో కాంగ్రెస్ పార్టీ నే ఉంది. సోనియాగాంధీతో సిద్ధ రామయ్య కు ఫోన్ చేయించండి.. వెంటనే ఆపండి అని సీఎం రేవంత్ ను కోరారు. ఆల్మట్టి విషయం లో వెంటనే సుప్రీంకోర్టు కు వెళ్లాలని సూచించారు. మీరు ఆపకపోతే పాలమూరు పులిబిడ్డ నా…లేకుంటే పేపర్ పులి నా అని అర్థం అవుతుందని సెటైర్లు వేశారు. కృష్ణా ట్రిబ్యునల్ మీటింగ్ జరగ బోతుందన్నారు. ఆ మీటింగ్ కు సీఎం స్వయంగా హాజరై ఆల్మట్టి ఎత్తు ఆపే విదంగా పోరాటం చేయాలన్నారు. BRS మీడియా, హరీష్ రావు మీడియా, సంతోష్ రావు మీడియా నన్నే టార్గెట్ చేస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు కవిత.
Also Read:Trump-Netanyahu: నెతన్యాహు మోసం చేశాడు.. ఖతార్ దాడులపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి
నా రాజీనామా ను స్పీకర్ ఫార్మాట్ లో చేశానన్నారు. ఫోన్ చేసి కూడా ఆమోదించమని అడిగానన్నారు. తెలంగాణ లో కొత్త రాజకీయ పార్టీలు వస్తే స్వాగతిస్తాం.. ప్రజాస్వామ్యం లో ఎవరికైనా పార్టీ లు పెట్టుకునే హక్కు ఉందన్నారు. నాకు బతుకమ్మ కోసం చాలా ఆహ్వానాలు వస్తున్నాయని తెలిపారు. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ రోజు మా స్వగ్రామం చింత మండక లో పాల్గొంటున్నానని వెల్లడించారు. సిద్దిపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసే అంతవరకు ఇంకా ఆలోచించ లేదని తెలిపారు.
తాజావార్తలు
-
Electricity Bill Reduction : ఇలా చేస్తే మీ కరెంట్ బిల్లు సున్నా!
-
Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు… సీట్లు దక్కేదెవరికి…?
-
Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
-
Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
-
LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?