Krishna River : కృష్ణానది వరద పెరుగుతున్న ఉధృతి.. మరో ప్రమాద హెచ్చరికకు సిద్ధంగా అధికారులు
- కృష్ణానది వద్ద కొనసాగుతున్న వరద ఉధృతి
- ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరికకు అవకాశం
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సూచన
- వచ్చే 24 గంటల్లో మరిన్ని వర్షాలు అంచనా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Krishna River : కృష్ణానదిలో వరద ప్రవాహం గంట గంటకు పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుతం ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో రెండూ సమానంగా ఉండి భారీ నీటి ప్రవాహం కొనసాగుతోంది. తాజా వివరాల ప్రకారం, బ్యారేజ్ వద్ద ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో రెండూ 5,38,867 లక్షల క్యూసెక్కులుగా నమోదయ్యాయి. పరిస్థితిని సమీక్షిస్తున్న అధికారులు మరికాసేపట్లో రెండవ ప్రమాద హెచ్చరిక (Second Danger Warning) జారీ చేసే అవకాశం ఉందని సూచించారు. విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ మాట్లాడుతూ, “కృష్ణా నదిలో వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో పరీవాహక ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. పొంగిపొర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదు. లోతట్టు ప్రాంత ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి” అని సూచించారు.
Bihar Elections 2025: బీహార్‌లో హత్యా రాజకీయాలు.. ఎన్నికల ప్రచారంలో తూటాకు బలైన నాయకుడు
Also Read
కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, నంద్యాల జిల్లాల్లో రోడ్డు రవాణా అంతరాయాలు చోటుచేసుకుంటున్నాయి. అధికారులు వరద ప్రభావిత మండలాల్లో ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచారు. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం, వచ్చే 24 గంటల్లో కూడా కృష్ణా పరివాహక ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వరద పరిస్థితి కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రజలు అధికారుల సూచనలు పాటించి, అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ విభాగం విజ్ఞప్తి చేసింది.
PM Modi: ఇద్దరు యువరాజులు, రెండు అవినీతి కుటుంబాలు.. రాహుల్, తేజస్వీలపై ప్రధాని ఫైర్..
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..