Telangana : కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు మీటింగ్ కొద్దిసేపటి క్రితమే ప్రారంభం అయింది. ఈ మీటింగ్ లో ఏపీ పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ ను ప్రతిపాదించింది. తెలంగాణ మాత్రం పది అంశాలను ప్రతిపాదించింది. ఇందులో చూసుకుంటే 1.పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి ఎత్తిపోతల పథకానికి అనుమతులు ఇవ్వాలి. 2. శ్రీశైలం నుంచి వేరే బేసిన్ కి నీటి తరలింపు పనులను వెంటనే ఆపేయాలి. 3. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు తెలంగాణ లో ప్రారంభించిన ప్రాజెక్టులు పూర్తయ్యేలా ఏపీ సహకరించాలి. అలాగే కృష్ణ ట్రిబ్యునల్ లో తెలంగాణ వాదనలకు మద్దతుగా ఏపీని కేంద్రం ఒప్పించాలి.
Read Also : Ap- Telangana : మొదలైన తెలంగాణ, ఏపీ సీఎంల మీటింగ్..
4. కృష్ణానది జలాలను వేరే బేసిన్ కు తరలించకుండా “కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు” చర్యలు తీసుకునేలా ఆదేశించాలి. దీంతో పాటు కృష్ణా జలాల అక్రమ తరలింపును అడ్డుకునేందుకు టెలిమెట్రీలను ఏర్పాటు చేసేందుకు ఏపీ ఒప్పుకోవాలి. 5.తుంగభద్ర బోర్డు నీటి తరలింపుపై చర్చించాలి. 6.రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకంపై ఎన్జీటీ ఉత్తర్వులను అమలు చేసే విధంగా కేంద్ర జలశక్తి శాఖ చర్యలు తీసుకోవాలి. ఆ మేరకు పునరుద్ధరణ జరపాలి. ఈ పథకంపై చట్టపరంగానే ముందుకు వెళ్లాలి. 7. శ్రీశైలం కుడి కాలువ ద్వారా ఎక్కువ నీటి తరలింపును నియంత్రించాలి. 8. శ్రీశైలం ప్రాజెక్టులో కొత్త ప్రాజెక్టులు హంద్రీనీవా, వెలిగొండ, గురు రాఘవేంద్ర నిర్మాణాలను నియంత్రించాలి. 9.శ్రీశైలం డ్యాం సేఫ్టీకి తగిన చర్యలు తీసుకోవాలి.
10.అక్రమంగా శ్రీశైలం నుంచి నీటి తరలింపు ద్వారా విద్యుత్ ఉత్పత్తికి తీవ్ర విఘాతం కలుగుతుంది దీనిని అడ్డుకోవాలి. 11. పోలవరం ప్రాజెక్టు తరహాలోనే ఇచ్చంపల్లి ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలి. ఇచ్చంపల్లి నుంచి కావేరికి గోదావరి జలాల తరలింపునకు తెలంగాణ సిద్ధం. అందులో 200 టీఎంసీల నీటిని వాడుకునేందుకు అనుమతులు ఇవ్వాలి. సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలి. ”ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి” ప్రాజెక్టుకు ఏఐబిపి కింద నిధులు ఇవ్వాలి. మహారాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వమే చర్చలు జరిపి తుమ్మిడి హట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణానికి సహకరించాలి అంటూ ఈ సమావేశంలో తెలంగాణ ప్రతిపాదనలు పెట్టింది. వీటిపై చర్చలు జరిపే అవకాశాలు ఉన్నాయి.
Read Also : RP Singh Arrest : మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఆర్పీ సింగ్ పై కేసు..