Bus Accident: రోడ్డు పక్కన ఆగి ఉన్న శ్రీకృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును కంటైనర్ లారీ వెనుక నుంచి బలంగా ఢీ కొట్టిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది.
Central Team: నేటి నుంచి వరద నష్టంపై తెలంగాణలో కేంద్ర బృందం పర్యటించబోతుంది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NDMA) సలహాదారు, కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ (ఆపరేషన్స్& కమ్యూనికేషన్స్) కల్నల్ కీర్తి ప్రతాప్ సింగ్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కేంద్ర బృందం.. హైదరాబాద్ లోని సచివాలయంలో సీఎస్ శాంతికుమారితో సమావేశం కానుంది.
Kishan Reddy: నేడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఖమ్మం పట్టణంలోని 16వ డివిజన్ దంసాలపురంలో పర్యటిస్తారు. అనంతరం పాలేరు నియోజకవర్గం తిరుమాలాయ పాలెం, రాకాసి తాండాలో పర్యటించనున్నారు. నేరుగా బాధితుల వద్దకు వెళ్లి వారితో మాట్లాడతారు నిత్యవసర వస్తువులు పంపిణీ చేస్తారు. ముంపు ప్రాంతాల్లో నిర్వహణ చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. బాధితులతో మాట్లాడి ప్రభుత్వం తరఫున చేపట్టిన పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు. నిన్న సాయంత్రం బీజేపీ రాష్ట్ర…
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హుటాహుటిన ఖమ్మం జిల్లాకు బయల్దేరారు. ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో.. మున్నేరు వాగు పొంగి పొర్లే అవకాశం ఉండడంతో భట్టి విక్రమార్క బయల్దేరి వెళ్లారు. ఇప్పటికే జిల్లాలో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించడంతో మున్నేరు వాగుకి మరోసారి వరద ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం అప్రమత్తం చేయాలని ఉపముఖ్యమంత్రి ఇప్పటికే…
Shivraj Singh Chauhan: రైతులకి సహాయం చేయడం అంటే దేవుడికి పూజ చేసినట్లే అని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఢిల్లీ నుంచి రైతులకి మంచి చేయాలని వచ్చామన్నారు.
Revanth Reddy Chitchat: ప్రజలందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గుండె కరిగిపోయే దృశ్యాలు… మనసు చెదిరిపోయే కష్టాలు…స్వయంగా చూశానని తెలిపారు.
CMRF Scam: తాజాగా CMRF స్కాం పై 6 కేసులు నమోదు చేసింది సిఐడి. వైద్యం చేయకపోయినా చేసినట్లు బిల్లులు సృష్టించాయి ఆసుపత్రులు. ఈ నేపథ్యంలో 28 ఆసుపత్రుల పైన కేసులు నమోదు చేసింది సిఐడి. ఈ కేసులో హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ లోని ప్రైవేటు ఆసుపత్రులపై కేసులు నమోదయ్యాయి. 30 ఆస్పత్రులు నకిలీ పిల్లలతో సీఎంఆర్ఎఫ్ నిధులు కొట్టేసారని ఆరోపణలు వచ్చాయి. 30 ఆసుపత్రులు కలిసి వందల కోట్ల రూపాయల సీఎంఆర్ నిధులు స్వాహా…