ఎల్లుండి ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉంది. రేపు రిజర్వేషన్స్ ప్రకటన ఉంటుంది. కార్పొరేషన్ల తో పాటు కొన్ని మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. సిద్దిపేట, అచ్చంపేట తో పాటు మరికొన్నింటికి ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు సహా పలు మున్సిపాలిటీల ఎన్నికలకు ఎస్‌ఈసీ సమాయత్తమవుతోంది. ఇందుకోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు పురపాలక శాఖ గతంలోనే…