తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గానికి మే 27న జరిగే ఉప ఎన్నిక నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పోలింగ్ రోజున వారి ఓటు వేసేందుకు ప్రత్యేక క్యాజువల్ సెలవులు మంజూరు చేస్తూ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. Thief Arrested: దొంగ నుండి 45 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఈ మేరకు వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జనగాం, ములుగు,…
Telangana MLC ByPoll: ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఎన్నికల ప్రచారానికి ఇవాల్టితో గడువు ముగుస్తుండటంతో ఓరుగల్లుకు అగ్ర నేతలు,ముఖ్య నేతలు పెద్ద సంఖ్యలో పోటా పోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
నాలుగు నెలలోనే కాంగ్రెస్ మోసం బయట పడింది మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఖమ్మం జిల్లా బోనకల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. సమావేశానికి హాజరైన హరీష్ రావు మాట్లాడుతూ.. బస్సు తప్పా అన్ని పథకాలు తుస్సే అని విమర్శించారు.
హైదరాబాద్ ను జాయింట్ క్యాపిటల్ చేసే కుట్ర జరుగుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. హైదరాబాద్ పై జరుగుతున్న కుట్రను ఆపాలంటే mlc గా బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. హన్మకొండ హంటర్ రోడ్డులోని సీఎస్ఆర్ గార్డెన్స్ లో వర్ధన్నపేట నియోజకవర్గం పట్టభద్రుల ఉప ఎన్నిక సన్నాహక సమావేశం నిర్వహించారు.
Ponguleti Srinivasa Reddy: ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు పూర్తి చేసే బాధ్యత నాదని రెవెన్యూ, ఐ అండ్ పీఆర్, గృహ నిర్మాణం శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
అభం శుభం తెలియని రెండేళ్ల బాలుడు ఆడుకుంటూ వెళ్లి నీటితొట్టిలో పడి ఊపిరి ఆడక మృత్యువాత పడ్డాడు. ఇంటి అవసరాల కోసం తవ్విన నీటితొట్టె బాలుడి పాలిట యమపాశంగా మారింది.
ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని సరిహద్దు్ల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.
అమెరికాలో మరో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందారు. జలపాతంలో మునిగిపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో లక్కిరెడ్డి రాకేష్ రెడ్డి, రోహిత్ మణికంఠ లేపాల అనే ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటన అమెరికాలోని అరిజోనాలోని ఫజిల్ క్రీక్ ఫాల్స్ వద్ద చోటుచేసుకుంది. మే 8వ తేదీన 16 మంది స్నేహితుల బృందం స్నాతకోత్సవం కోసం ఈ జలపాతం వద్దకు వెళ్లారు. ఈ ఘటన జరిగినప్పుడు రాకేష్, రోహిత్ జలపాతంలో ఈత కొడుతున్నప్పుడు…
Daggubati Venkatesh: దగ్గుబాటి వెంకటేష్ తన తండ్రికి తగ్గ కొడుకుగా పేరు తెచ్చుకున్నాడు. కలియుగ పాండవులు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసి ప్రముఖ హీరోగా ఎదిగారు.