Chain Snatchers: ఖమ్మం జిల్లా పెనుబల్లి, కల్లూరుమండలంలో చైన్ స్నాచర్స్ రెచ్చిపోయారు. గంట వ్యవధిలో మూడు చోట్ల చైన్ స్నాచింగ్ జరిగింది. మధిర మండలం సిరిపురం నుండి భార్య భర్తలు పద్మరెడ్డి, ఈశ్వర్ రెడ్డి వీ.ఎం.బంజర్ కు బయలు దేరారు. అయితే వారిద్దిరిని పల్సర్ బైక్ పై ఇద్దరు దుండగలు వెంబడించారు. అయితే భార్యభర్తలు ఇద్దరూ దుండగులను గమనించలేదు. వారు కూడా ప్రయాణికులే అనుకున్నారు. అయితే.. ఆంద్ర ప్రాంతం తిరువూరు నుండి వెంబడిస్తూ వచ్చారు. పెనుబల్లి మండలం కుప్పెనకుంట్ల వద్ద రాగానే పరిసర ప్రాంతంలో ఎవరూ లేరని గమనించిన స్నాచర్లు.. భార్య భర్తలు ప్రయాణిస్తున్న బైక్ ను పల్సర్ బైక్ తో ఢీ కొట్టారు. దీంతో భార్య భర్తలు కిందపడిపోయారు. దీంతో స్నాచర్స్ ఇద్దరు భార్య భర్తల దగ్గరకు వచ్చి దాడి చేశారు.
ఆమె మెడలోని బంగారం గొలుసును లాక్కెళ్లారు. భార్య పద్మరెడ్డి మేడలో ఉన్న నాన్ తాడు గట్టిగా పట్టుకొనేసరేకి వారిని తోసేసి ఇద్దరు దుండగులు అక్కడి నుంచి పరారు అయ్యారు. అయితే భార్య మెడ భాగంలో గాయాలు అయ్యాయి. భర్త ఈశ్వర్ రెడ్డికి కాళ్ళకు, పొట్ట కింద భాగం గాయాలు అవ్వటంతో పెనుబల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఇదే విధంగా పెనుబల్లి మండలంలో కారాయిగూడెం, కుప్పెనకుంట్ల గ్రామలల్లో, కల్లూరు మండలం NSP వద్ద చైన్ స్నాచింగ్ జరగటంతో ప్రజలు బెంబేలేత్తున్నారు. బాధితుల నుండి ఫిర్యాదులు తీసుకున్న కల్లూరు, వీఎం బంజర్ పోలీసులు చైన్ స్నాచర్స్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Hyderabad Student: ఫిలిప్పీన్స్ లో నిజామాబాద్ విద్యార్థి మృతి..