Central Team: నేటి నుంచి వరద నష్టంపై తెలంగాణలో కేంద్ర బృందం పర్యటించబోతుంది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NDMA) సలహాదారు, కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ (ఆపరేషన్స్& కమ్యూనికేషన్స్) కల్నల్ కీర్తి ప్రతాప్ సింగ్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కేంద్ర బృందం.. హైదరాబాద్ లోని సచివాలయంలో సీఎస్ శాంతికుమారితో సమావేశం కానుంది. సచివాలయంలో ఏర్పాటు వరద ప్రభావిత ప్రాంతాల ఫోటో ఎగ్జిబిషన్ ని ఈ కేంద్ర బృందం తిలకించనుంది. ఆ తర్వాత వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి.. నష్టం అంచనా వేయనుంది. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలతో పాటు కోదాడలో ముగ్గురు సభ్యుల చొప్పున పర్యటన కొనసాగించనున్నారు. ఈ బృందంలో కల్నల్ కేపీ సింగ్‌తో పాటుగా ఆర్థిక శాఖ, వ్యవసాయ శాఖ, రోడ్లు, రహదారుల శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ విభాగాలకు చెందిన అధికారులు ఉన్నారు. కేంద్ర బృందం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులు, అధికారులతో నేరుగా మాట్లాడనుంది.
Read Also: Devara : దేవర నార్త్ అమెరికా 17 రోజుల అడ్వాన్స్ బుకింగ్స్.. కలెక్షన్స్ ఇవే..
ఇక, ఈరోజు మధ్యాహ్నం 1 గంట నుంచి కూసుమంచి మండలంలోని భగవత్‌వీడు తండాలో నష్టం జరిగిన 100 ఎకరాలకు పైగా పంటలను పరిశీలించి రైతులతో అధికారులు మాట్లాడనున్నారు. ఆ తర్వాత 1:45 నుంచి 2:45 గంటల వరకు ఖమ్మం రూరల్ మండలంలోని గూడురుపాడు, తనగంపాడు, కస్నాతండాలో ఇళ్లు, పంటలను సెంట్రల్ టీమ్ పరిశీలించనుంది. ఇక, మధ్యాహ్నం 3:15 నుంచి 3: 30 వరకు తిరుమలాయపాలెం మండలంలోని రాకాసితండా, ఖమ్మం రూరల్ మండలంలోని ఎంవీ.పాలెంలో ఇళ్లు, పంటలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయనుంది. అనంతరం మహబూబాబాద్ జిల్లాలో జరిగిన నష్టాన్ని పరిశీలించి తిరిగి రాత్రి ఖమ్మం చేరుకుంటారు. ఇదే, కేంద్ర బృందం రేపు (గురువారం) ఉదయం 7:30 నుంచి ఖమ్మం రూరల్ మండలంలోని పోలేపల్లి పరిధిలోని రాజీవ్ గృహకల్ప, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం కాలనీ, 8:15 నుంచి 10: 30 గంటల వరకు బొక్కలగడ్డ, మోతీనగర్, 35వ డివిజన్ వెనుకభాగం గ్యాస్ గోదాం సమీపాన, ప్రకాశ్‌నగర్, వైకుంఠధామం, ధంసలాపురం, కొత్తూరులో పర్యటించనుంది. అలాగే, ఉదయం 10:40 నుంచి 11గంటల వరకు జలగంనగర్ ప్రాంతాల్లో దెబ్బతిన్న ఇళ్లు, ఎంపీడీఓ కార్యాలయాన్ని పరిశీలించనుంది. ఆ తర్వాత ఈ టీమ్ సూర్యాపేట జిల్లాలోని కోదాడకు వెళ్లనుంది.
Read Also: Vande Bharat : గయాలో వందేభారత్ రైలుపై రాళ్ల దాడి, కిటికీ అద్దాలు ధ్వంసం
కాగా, కేంద్ర ప్రభుత్వం నుంచి వరద నష్టంపై పరిశీలనకు వస్తున్న అధికారుల్లో రెండో బృందం.. ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2:10 వరకు కూసుమంచి మండలంలోని జుజ్జుల్‌రావుపేలో పీఆర్ రోడ్డు, కల్వర్టు, పాలేరులో గండిపడిన ఎన్నెస్పీ కాలువ, ఎర్రగడ్డతండాలో దెబ్బతిన్న భక్త రామదాసు ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించనుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 2:30 నుంచి 3: 55 వరకు తిరుమలాయపాలెం మండలంలో బీరోలు, రాకాసితండా, పాతర్లపాడులో తెగిన చెరువులు, రోడ్లు, బ్రిడ్జిలను పరిశీలించిన తర్వాత మహబూబాబాద్ జిల్లాకు వెళ్లనుంది. అక్కడ పరిశీలన అనంతరం రాత్రి ఖమ్మం చేరుకొని బస చేయనుంది.. ఆ తర్వాత గురువారం ఉదయం 8 నుంచి 10గంటల వరకు ఖమ్మం రూరల్ మండలంలోని తల్లంపాడు, కస్నాతండా, తనగంపాడు, దానవాయిగూడెం, ప్రకాశ్‌నగర్‌లో వాటర్ ఫిల్టర్ బెడ్, బ్రిడ్జులను ఈ కేంద్ర బృందంలోని అధికారులు పరిశీలిస్తారని సమాచారం.