Kishan Reddy: నేడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఖమ్మం పట్టణంలోని 16వ డివిజన్ దంసాలపురంలో పర్యటిస్తారు. అనంతరం పాలేరు నియోజకవర్గం తిరుమాలాయ పాలెం, రాకాసి తాండాలో పర్యటించనున్నారు. నేరుగా బాధితుల వద్దకు వెళ్లి వారితో మాట్లాడతారు నిత్యవసర వస్తువులు పంపిణీ చేస్తారు. ముంపు ప్రాంతాల్లో నిర్వహణ చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. బాధితులతో మాట్లాడి ప్రభుత్వం తరఫున చేపట్టిన పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు. నిన్న సాయంత్రం బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుండి ఖమ్మంకి పార్టీ తరపున నిత్యావసర వస్తువులు, ఇతర సామాగ్రిని పరిశీలించారు కిషన్ రెడ్డి. ఇవాళ ఖమ్మం పాలేరు నియోజకవర్గం వరద ముంపు బాధితులకి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ తోపాటు ఈటెల రాజేందర్ , కొండా విశ్వేశ్వర్ రెడ్డి ల పర్యటించి వరద బాధితులకు నిత్యవసరం సరుకులను పంపిణీ చేయనున్నారు.
Surya Stotram: ఈ స్తోత్ర పారాయణం 11 సార్లు చేయండి.