Central Ministers: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఖమ్మం పట్టణంలో మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహించిన సంగతి తెలిసిందే. వరదల కారణంగా చాలా మంది బాధితులుగా మిగిలిపోయారు. ఖమ్మంలోని 20 కాలనీలకు పైగా వరద నీటిలో చిక్కుకోగా.. భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, బండి సంజయ్‌లు ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఇవాళ ఉదయం 9 గంటలకు విజయవాడ నుంచి నేరుగా శివరాజ్‌సింగ్ ఖమ్మం చేరుకోనుండగా బండి సంజయ్ ఆయనతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లు పాల్గొననున్నారు.
Read also: Lalitha Sahasranama Stotram: శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం
అనంతరం పంట నష్టంతోపాటు ఆస్తి నష్టంపై కేంద్ర, రాష్ట్ర అధికారులతో వారు సమీక్షించనున్నారు. అనంతరం ఉదయం 11.30 కు సచివాలయంలో సీఎంఓ అధికారులతో బ్రీఫింగ్ ఏర్పాటు చేశారు. మధ్నాహ్నం 2.30 కు కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సమావేశం ఉంటుంది. మధ్యాహ్నం 3.30కు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో కలిసి రాష్ట్రంలో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో వాటిల్లిన నష్టంపై సమీక్షపై మాట్లాడనున్నారు.