డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హుటాహుటిన ఖమ్మం జిల్లాకు బయల్దేరారు. ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో.. మున్నేరు వాగు పొంగి పొర్లే అవకాశం ఉండడంతో భట్టి విక్రమార్క బయల్దేరి వెళ్లారు. ఇప్పటికే జిల్లాలో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించడంతో మున్నేరు వాగుకి మరోసారి వరద ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం అప్రమత్తం చేయాలని ఉపముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Read Also: Kolkata Doctor Case: ఆర్‌జీ కర్ మాజీ-ప్రిన్సిపాల్‌కి సన్నిహితంగా ఉన్న ముగ్గురు డాక్టర్లపై వేటు..
మున్నేరు వాగుకి భారీగా వరద వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు. వరద ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో జిల్లాలోని ఉన్నత స్థాయి అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు సమస్యలు తలెత్తకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారుల అందరికీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు.
Read Also: IMD Alert: పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. జాబితా విడుదల