Bus Accident: ట్రావెల్స్ బస్సును ఢీకొట్టిన కంటైనర్ లారీ.. ఇద్దరు మృతి, 11 మందికి గాయాలు
- శ్రీకృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీ కొట్టిన కంటైనర్ లారీ..
- యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకున్న ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bus Accident: రోడ్డు పక్కన ఆగి ఉన్న శ్రీకృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును కంటైనర్ లారీ వెనుక నుంచి బలంగా ఢీ కొట్టిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది. చౌటుప్పల్ మండలంలోని ఎల్లం బావి గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఆగి వున్న బస్సును వెనుకనుంచి అతి వేగంతో కంటైనర్ లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సులో నిద్రిస్తున్న ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతులు ఖమ్మం జిల్లా ఇల్లందుకి చెందిన సతీష్ కుమార్, తేజ గా పోలీసులు గుర్తించారు. వారిద్దరి మృతదేహాలను చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 23 మంది ప్రయాణికులు ఉన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. కంటైనర్ లారీ డ్రైవర్ ను అదుపులో తీసుకుని విచారిస్తున్నారు.
Terror Threats In Mumbai: ముంబైకి ఉగ్రముప్పు హెచ్చరికలు.. అధికారులు అలర్ట్..!
Also Read
- Harish Rao : రాష్ట్రంలో రైతు రాజ్యం పోయి రాక్షస రాజ్యం వచ్చింది
- Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!
- Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం..!
- Bank Turns Bar : వారెవ్వా.. బ్యాంక్‌ను బార్‌గా మార్చిన ఉద్యోగులు.. లిక్కర్ డిపాజిట్.. నిబంధనలు విత్‌డ్రా..!
తాజావార్తలు
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!