Shivraj Singh Chauhan: రైతులకి సహాయం చేయడం అంటే దేవుడికి పూజ చేసినట్లే అని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఢిల్లీ నుంచి రైతులకి మంచి చేయాలని వచ్చామన్నారు. పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలం నరసింహుల గూడెం ప్రాంతంలో పంట నష్టం జరిగిన ప్రాంతాన్ని కేంద్ర మంత్రులు శివరాత్రి చౌహాన్ బండి సంజయ్ కుమార్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. ఖమ్మంలో ఏరియల్ సర్వే చేసిన అనంతరం ప్రజలతో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ మాట్లాడుతూ.. ఛాపర్ నుంచి ప్రత్యక్షంగా చూశానని తెలిపారు. వరి పంట నష్టం బాగా జరిగిందన్నారు. ఇళ్లలో సామాను, వంట సామాగ్రి, తినేది , అవులు, గేదెలు కూడా దెబ్బతిందన్నారు. మీకు సహాయం చేయడం కోసం వచ్చానని తెలిపారు. నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు ఇక్కడకు వచ్చానని అన్నారు. రైతులు కంట నీరు పెట్టుకోవద్దన్నారు. రైతులకి ఏ విధంగా సహకరించాలో ఆలోచిస్తున్నామని తెలిపారు.
Read also: Balapur Ganesh: సర్వాంగ సుందరంగా ముస్తాబైన బాలాపూర్ గణేష్ విగ్రహం..
కేంద్రం, రాష్ట్రప్రభుత్వం రెండూ కూడా సమన్వయంతో సహకారం అందిస్తామని క్లారిటీ ఇచ్చాఉ. ముగ్గురు మంత్రులు కుడా మీకు వున్నారన్నారు. సీఎంతో కూడా మాట్లాడతామన్నారు. రైతులకి సహాయం చేయడం అంటే దేవుడికి పూజ చేసినట్లే అన్నారు. రాజకీయాలు చేయడానికి రాలేదు.. రాజకీయాలలోకి రాలేదు.. గతంలో సర్కార్ మమ్ములను ఉపయోగించు కోలేదని తెలిపారు. గతంలో వున్న నిధులను కేంద్రం నిధులను వాడుకోలేదన్నారు. ఫసల్ భీమా అమలు చేయలేదు.. అందువల్ల రైతులు కష్టాల్లో వున్నారని తెలిపారు. గత ప్రభుత్వం ఆదుకోలేదు… అందువల్ల కేంద్రం ఆదుకోలేక పోయిందన్నారు. గత ప్రభుత్వంకు కేంద్ర సంక్షేమ పథకాలను అమలు చేయలేదన్నారు. ఇప్పుడు జరిగిన తాత్కాలిక మూగా ఏమి చేయాలో పరిష్కారం చేస్తాం ఆదుకుంటామని తెలిపారు.
ప్రముఖ గణేష్ దేవాలయాలు ఇవే.. ఒక్కసారి లుక్ వేయండి.