కేరళలో వానలు దంచికొడుతున్నాయి. నైరుతి రుతుపవనాలు రావడానికి ముందే రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భారత వాతావరణ శాఖ ( ఐఎండీ) బుధవారం రాష్ట్రంలోని ఏడు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది. త్రిసూర్, పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్, వయనాడ్, కన్నూర్, కాసర్ గోడ్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది ఐఎండీ. గురువారం కన్నూర్, కాసర్ గోడ్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. కేరళ చుట్టుపక్కల ప్రాంతాలలో…
భారత వ్యవసాయ రంగానికి గుడ్ న్యూస్ చెప్పింది భారత వాతావరణ శాఖ ( ఐఎండీ). భారత్ లో వర్షాలకు అత్యంత కీలకంగా భావించే నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది ముందుగానే రానున్నాయి. భారత వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు జీవనాధారంగా భావించే నైరుతి రుతుపవనాలు మే 27న కేరళను తాకనున్నట్లు ఐఎండీ వెల్లడించింది. ఈ ఏడాది దేశంలో ముందస్తు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కేరళలో సాధారణంగా జూన్ 1న రుతుపవనాలు ప్రారంభం అయినా.. మొదటి,…
కేరళలో కొత్త రకం వైరస్ అక్కడి ప్రజలను కంగారెత్తి్స్తోంది. కేరళలోని పలు జిల్లాల్లో ఇటీవల టమాటో ఫ్లూ అనే వైరస్ వెలుగుచూసింది. ముఖ్యంగా ఐదేళ్ల లోపు వయసున్న చిన్నారుల్లో ఈ వైరస్‌ను అధికారులు గుర్తించారు. ఈ వైరస్ కారణంగా చిన్నారులు డీ హైడ్రేషన్, దగ్గు, జలుబు, డయేరియా, చర్మంపై ఎర్రగా దద్దుర్లు రావడం వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. చర్మంపై టమాటో ఆకారంలో బొబ్బలు వస్తుండటంతో దీనికి టమాటా ఫ్లూ అని పేరు పెట్టారు. ఇప్పటికే కొల్లం ప్రాంతంలో…
కేరళలో వెలుగు చూసిన షిగెల్లా బ్యాక్టీరియా వల్ల దేశంలో తొలి మరణం సంభవించింది. కేరళలో 16 ఏళ్ల అమ్మాయి దేవానంద షిగెల్లా బ్యాక్టీరియా బారినపడి చనిపోయింది. ఓ ఫుడ్ స్టాల్ వద్ద షవర్మాను తినడం వల్ల ఆమెలో బ్యాక్టీరియా సోకిందని కుటుంబీకులు ఆరోపిస్తు్న్నారు. షవర్మా తిన్న రెండు రోజులకే తమ కుమార్తె మరణించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ కేసును కేరళ హైకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ చేపడుతోంది. కాగా షిగెల్లా బ్యాక్టీరియా సోకడం అనేది…
అసలే కరోనా సమయం.. ఏ కొత్త వైరస్ వెలుగు చూసినా.. అది కరోనా వేరియెంటేనా? అని అనుమానంగా చూడాల్సిన పరిస్థితి.. అయితే, కేరళలో మరోసారి షిగెల్లా కేసు బయటపడింది.. కోజికోడ్‌లోని పుత్తియప్పలో ఏడేళ్ల బాలికకు ఈ వ్యాధి సోకినట్టు గుర్తించారు అధికారులు.. ఏప్రిల్27వ తేదీన కేసు నమోదైందని, ఇప్పటి వరకు ఎవరికీ వ్యాపించిన దాఖలాలు లేవంటున్నారు అధికారులు.. ఈ నెల 20వ తేదీన చిన్నారిలో షిగెల్లా లక్షణాలు కనిపించడంతో.. పరీక్ష నిర్వహిస్తే పాజిటివ్‌గా తేలనడంతో స్థానికులు ఆందోళనకు…
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సినిమాలను బ్యాన్ చేస్తున్నారు అనే వార్త ప్రస్తుతం మాలీవుడ్ ని షేక్ చేస్తోంది. దుల్కర్ కి మళయాళంలోనే కాదు తెలుగులోనూ మంచి పేరు ఉంది. మహానటి, కనులు కనులను దోచాయంటే, కురుప్ లాంటి చిత్రాలతో తెలుగు అభిమానులను సంపాదించుకున్న ఈ హీరోపై కేరళ థియేటర్ ఓనర్స్ నిషేధం విధించారు. అంతేకాకుండా అతడు నటించిన చిత్రాలన్నింటినీ బాయ్‌కాట్ చేయాలని ద ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ యునైటెడ్ ఆర్గనైజేషన్ ఆఫ్ కేరళ(ఎఫ్‌ఈయూకే) నిర్ణయించాలని చూడడం…
సమాజంలో ఆడవారికి రక్షణ లేదు.. ఏ రంగంలో అడుగుపెట్టినా వారికి మృగాళ్ల కామచూపుల నుంచి విముక్తి ఉండడం లేదు. తాజాగా ఒక మలయాళ దర్శకుడు.. తన వద్ద పనిచేసే మహిళను అత్యాచారం చేసి అరెస్ట్ అయ్యాడు. ప్రస్తుతం ఈ ఘటన కేరళలో సంచలనం సృష్టిస్తోంది. మళ్ళీవుడు దర్శకుడు లిజు కృష్ణను నిన్న పోలీసులు అత్యాచార ఆరోపణలతో అరెస్ట్ చేశారు. గత కొంత కాలంగా సెట్ లో పనిచేసే ఒక మహిళను ప్రేమ, పెళ్లి అనే మాటలు చెప్పి…
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఇవాళ్టితో ముగిసింది.. మరో మూడు రోజుల్లో ఫలితాలు రాబోతున్నాయి.. ఇదే సమయంలో మరో ఎన్నికలకు సిద్ధం అవుతోంది కేంద్ర ఎన్నికల సంఘం.. ఆరు రాష్ట్రాల్లోని 13 స్థానాలకు ఎన్నికలకు జరగనుండగా.. ఇవాళ షెడ్యూల్ విడుదల చేసింది.. అస్సాంలో 2, హిమాచల్ ప్రదేశ్ లో 1, కేరళలో 3, నాగాలాండ్ లో 1, త్రిపురలో 1, పంజాబ్‌లో 5 రాజ్యసభ స్థానాలు.. ఇలా మొత్తం 13 రాజ్యసభ స్థానాలు ఏప్రిల్‌లో ఖాళీ…
బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న కేసీఆర్.. మళ్లీ రాష్ట్రాల పర్యటన మొదలుపెట్టనున్నారు. ఈనెల 20న ముంబై వెళ్లి మహారాష్ట్ర సీఎంతో సమావేశం కానున్నారు. త్వరలో బీజేపీయేతర సీఎంల సమావేశం సన్నాహాలు జరుగుతుండగా.. మాజీ ప్రధాని దేవెగౌడను కూడా భేటీకానున్నారు. మహారాష్ట్ర సియం ఉద్దవ్ థాకరే టిఆర్ఎస్ అధినేత కేసియార్‌కు ఫోన్ చేశారు. ఈనెల 20న ముంబై రావాలని ఆహ్వానించారు. బిజెపికి వ్యతరేకంగా కేసియార్ చేస్తున్న పోరాటానికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఫెడరల్ స్ఫూర్తి కోసం ప్రజా వ్యతిరేక విధానాలను…
మొన్నటి వరకు ఆయనో కూలి. చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ముతక గళ్ల లుంగి, మాసిపోసిన గడ్డం, తల వెంట్రుకలు, చేతిలో ప్లాస్టిక్ కవర్ సంచీ. కూలికి పోతే తప్పించి ఇళ్లు గడవని పరిస్థితి. ఇలాంటి వ్యక్తి ఇప్పుడు కేరళలో రోల్ మోడల్ గా మారిపోయాడు. షాకింగ్ మేకోవర్‌తో ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాడు. రోడ్డుపై కూలిపని చేసుకునే కోజికోడ్ కు చెందిన మామిక్క అనే వ్యక్తి స్విస్ మేకోవర్‌తో షాకిచ్చాడు. గతంలో మామిక్క లుంగీ,…