భారతదేశంలో వివాహ బంధానికి ఒక విలువ ఉంది.. భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలు ఉన్నా ఆ వివాహ బంధమే వారిని కాపాడుతోంది. కానీ ఇటీవల సమాజంలో భార్యాభర్తల మధ్య బంధం చూస్తుంటే సిగ్గేస్తోంది. వారు చేసే పనులకు సమాజం తల దించుకొంటుంది. శృంగారానికి అలవాటు పడిన వారు వావివరుసలు మరిచి, విచక్షణ మరిచి పరాయి వారి భార్యలతో శృంగారానికి సై అంటున్నారు. దీనికి పోష్ గా పెట్టుకున్న పేరే పార్టనర్ ఎక్స్ చేంజ్.. తాజాగా కేరళలో ఈ…
గజరాజులకు ఆకలి ఎక్కువ. అందులోనూ చెరకు గడలు కనిపిస్తే చాలు వాటి ఆనందానికి అవధులు వుండవు. అందుకే పంట పొలాలపై పడి అవి బీభత్సం సృష్టిస్తుంటాయి. అయితే కేరళలోని ఆ గజరాజుకి మాత్రం రేషన్ బియ్యం అంటే ఇష్టం. ఎక్కడ రేషన్ బియ్యం కనిపించినా ఏనుగు లాగేస్తోంది. దీంతో ఇడుక్కి జిల్లాలో మూడురోజులుగా రేషన్ బియ్యం ప్రజలకు అందించడం లేదు. రాత్రికిరాత్రే రేషన్ దుకాణంలోని బియ్యం బస్తాలు మాయం అయిపోతున్నాయి. దొంగలు చేశారని కొందరు భావించారు. అయితే…
ఆర్ఆర్ఆర్ చిత్ర ప్రమోషన్స్ శరవేగంగా జరిగిపోతున్నాయి. ముంబై, చెన్నై, కేరళ.. ఇలా రోజుకో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నారు ట్రిపుల్ ఆర్ బృందం. ఇక తాజాగా కేరళలో ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక ఈ ఈవెంట్ కి మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ వేడుకలో జూ. ఎన్టీఆర్ మాట్లాడుతూ “ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.. ముఖ్య…
‘ఆర్ఆర్ఆర్’.. ప్రస్తుతం ఏ భాషలో విన్నా ఈ సినిమా గురించే చర్చ. సంక్రాంతి కానుకగా జనవరి 7 న విడుదలవుతున్న ఈ సినిమా ప్రొమొతిఒన్స్ ని వేగవంతం చేశారు మేకర్స్. ఈ భాషలో ఈవెంట్ పెడితే ఆ భాషలోని స్టార్ హీరోలను గెస్ట్ గా పిలుస్తూ అటెన్షన్ రాబడుతున్నాడు దర్శక ధీరుడు రాజమౌళి. హిందీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సల్మాన్ ఖాన్ గెస్ట్ గా రాగా, తమిళ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కోలీవుడ్ హీరోలు…
దేశంలో ఒమిక్రాన్ టెన్షన్ రోజురోజుకు పెరిగిపోతున్నది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. మహారాష్ట్ర, ఢిల్లీ, యూపీ, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. నూతన సంవత్సర వేడుకలపై అనేక రాష్ట్రాలు ఇప్పటికే నిషేధం విధించాయి. తాజాగా కేరళ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. డిసెంబర్ 30 నుంచి జనవరి 2 వ తేదీ వరకు నైట్ కర్ఫ్యూ అమలు…
కేరళలోని అలప్పుజా జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శనివారం నాడు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నేత కేఎస్ షాన్‌ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. శనివారం రాత్రి పార్టీ కార్యాలయం నుంచి ఇంటికి వెళ్తుండగా ఈ హత్య జరిగినట్లు పోలీసులు చెప్తున్నారు. అయితే ఆ ఘటన మరువకముందే ఆదివారం ఉదయం బీజేపీ నేత రెంజిత్ శ్రీనివాసన్ కూడా హత్యకు గురయ్యారు. కొందరు దుండగులు ఆయన ఇంట్లోకి చొరబడి హత్య చేసినట్లు తెలుస్తోంది.…
పరుగుల రాణి పిటి ఉషపై కేరళలోని కోజికోడ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మాజీ అథ్లెట్ జెమ్మా జోసెఫ్ ఫిర్యాదు మేరకు ఉషపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కోజికోడ్‌లో 1,012 చదరపు అడుగుల ఫ్లాట్‌ను జెమ్మా జోసెఫ్ కొనుగోలు చేశారని, వాయిదాల రూపంలో రూ. 46 లక్షలు చెల్లించారని తెలిపారు. Read Also:కాశ్మీర్లో ఎన్కౌంటర్.. ఒక ఉగ్రవాది హతం అయినప్పటికీ ఆ ఫ్లాట్‌ను బిల్డర్ జోసెఫ్‌కు ఇవ్వలేదు. అయితే పిటి ఉష…
ఎండైనా, వానైనా, మంచైనా … ట్రాఫిక్ పోలీసులు తమ విధులను నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా మండుటెండల్లో, వడగాల్పుల్లో గంటల తరబడి నిల్చొని విధులను నిర్వహించడం ట్రాఫిక్ పోలీసులకు చాలా ఇబ్బంది. వీరి కష్టాలను గమనించిన కేరళ ప్రభుత్వం… కొన్ని ప్రత్యేక సదుపాయాలతో సౌర గొడుగులను అందిస్తోంది. కేవలం తలకు చల్లదనాన్ని ఇవ్వడమేకాదు.. ఈ గొడుగుల్లో ఫ్యాన్, మంచినీటి బాటిల్ పెట్టుకునే స్టాండ్ , గొడుగుతోపాటు కూర్చునేందుకు సీటు, వెలుతురు కోసం లైటు ఏర్పాటుచేసే అవకాశాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.…
కేరళను గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు. అటువంటి కేరళ ఇప్పుడు వరస విపత్తులతో అతలాకుతం అవుతున్నది. దేశంలో తొలి కరోనా కేసులు కేరళ రాష్ట్రంలోనే కనిపించాయి. ఫస్ట్ వేవ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్న కేరళ రెండో వేవ్‌లో చాలా ఇబ్బందులు పడింది. ఇప్పటికి కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కేరళలో ఇప్పటికీ పాజిటివిటి రేటు 10 శాతం వరకు ఉన్నది. కరోనాతో పాటు వరదలు, మరోవైపు బర్డ్‌ఫ్లూ కేసులు ఆ రాష్ట్రాన్ని ఇబ్బందులు పెడుతున్నాయి. Read: డెంగీతో బీజేపీ…
కేరళ రాష్ట్రాన్ని బర్డఫ్లూ భయపెడుతున్నది. ఆ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. అలప్పుజ జిల్లాలో కోళ్లు, బాతులు ఫ్లూ బారిన పడుతున్నాయి. జిల్లాలోని తకళి గ్రామ పంచాయతీలో సుమారు 1200 బాతులు బర్డ్‌ప్లూ బారిన పడటంతో వాటిని అధికారులు పట్టుకొని చంపేశారు. అలప్పుజ జిల్లాలో ఈ వ్యాధి వ్యాపిస్తుండటంతో కలెక్టర్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ఫ్లూ ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. Read: అన్నమయ్య…