హైదరాబాద్ వాతావరణ కేంద్రం తీపి కబురు చెప్పింది. మరో రెండు రోజుల్లో తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న వెల్లడించారు. ఈ నెల 12 నాటికి తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. చత్తీస్ గఢ్ నుంచి కోస్తా మీదుగా ఏర్పడిన ద్రోణి గురువారం తెలంగాణ నుంచి దూరంగా వెళ్లిందని దీంతో రుతుపవనాలు ముందుకు కదిలేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది. రాబోయే రెండు రోజులు గోవా, కర్నాటకతో పాటు దక్షిణ ఏపీలోని…
మనం గుడికి వెళితే కోరిక కోర్కెలు తీర్చు దేవుడా అంటూ మొక్కుకుంటాం. అదిజరిగితే మొక్కులు తప్పకుండా చెల్లించుకుంటాం అంటూ ప్రదర్శనలు చేస్తాం. దీపాలు పెడుతూ అమ్మవారికి స్తోత్రాలు పాడుతూ స్మరించుకుంటాం. మనం ఇళా గుడికి వెళ్ళి భక్తితో చేస్తే అమ్మవారు కరుణిస్తుందని ఓనమ్మకం. సాధారణంగా మనం దేవుణ్ని కీర్తిస్తాం. కానీ ఓగుడిలో మాత్రం దీనికి విరుద్దంగా ఉంటుంది. ఆ గుడికి వెళితే మొక్కుకోవడం ఏమో కానీ.. అమ్మవారికి నానా తిట్లు తిట్టాలట. ఏంటీ ఆలయంలో అమ్మవారిని తిట్టాలా…
కేరళలో సంచలనం రేపిన మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య కేసులో కోర్ట్ కీలక తీర్పు వెల్లడించింది. కట్నం కోసం వేధించి.. 22 ఏళ్ల యువతి విస్మయ భర్తే కారణం అయ్యాడని… భర్త వల్లే విస్మయ బలవన్మరణానికి పాల్పడేలా చేశాడనే వాదనలతో కోర్టు ఏకీభవించింది. దీంతో భర్త కిరణ్ కుమర్ కు 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు విస్మయ కుటుంబానికి 15 లక్షల పరిహారాన్ని చెల్లించాలని కేరళలోని కొల్లాం కోర్ట్ ఆదేశించింది. వైద్య విద్యార్థి విస్మయ 2019 మే…
ఎండ వేడిమితో అల్లాడుతున్న తెలంగాణ వాసులకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో రాగల మూడు రోజుల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమ దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు మధ్యలో కేంద్రీకృతమైన ఉపరితల ఆవర్తనం బలహీనపడిందని పేర్కొంది. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పలు…
నైరుతి రుతుపవనాలు మరికొన్ని రోజుల్లో కేరళ తీరాన్ని తాకనున్నాయి. సాధారణం కన్నా ఐదు రోజుల ముందే మే 27న నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయి. ఈ లోపే కేరళలో వర్షాలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదు అవుతున్నాయి. దీంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తం అయింది. 10 జిల్లాల్లో శని, ఆదివారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ఇప్పటికే హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. తిరువనంతపురం, కొల్లం, పతనంతిట్ట,…
ప్రస్తుతం ప్రపంచాన్ని మంకీపాక్స్ వైరస్ కలవరపెడుతోంది. ఇప్పటికే 11 దేశాల్లో 80 కేసులు గుర్తించగా… మరో 50 కేసులు పరిశీలనలో ఉన్నాయి. ఇటీవల మే మొదటివారంలో బ్రిటన్ లో ఓ వ్యక్తిలో వైరస్ కనుకున్నారు. నైజీరియా నుంచి బ్రిటన్ కు వచ్చిన వ్యక్తిలో వైరస్ ను కనుక్కున్నారు. తాజాగా మే 18న యూఎస్ఏలో కూడా ఒక కేసు బయటపడింది. దీంతో ప్రపంచ ఆరోగ్య కేంద్రం ( డబ్ల్యూహెచ్ఓ) అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. ఇప్పటికే యూకే, యూఏస్ఏ, పోర్చుగల్,…
కేంద్ర ప్రజలపై పెట్రో భారాన్ని తగ్గించింది. పెట్రోల్, డిజిల్ పై కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని పెట్రోల్ పై రూ. 8, డిజిల్ పై రూ.6 తగ్గించడంతో లీటర్ పెట్రోల్ పై రూ. 9.5, డిజిల్ పై రూ. 7 తగ్గింది. నిన్నటి అర్థరాత్రి నుంచి తగ్గిన రేట్లు అమలులోకి వచ్చాయి. గతేడాది నవంబర్ లో దీపావళి ముందు కూడా కేంద్ర ఇదే విధంగా లీటర్ పెట్రల్ పై రూ.5, డిజిల్ పై రూ. 10 కేంద్ర ఎక్సైజ్…
కేరళలో భారీ ఎత్తున డ్రగ్స్‌ను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొచ్చిన్ కోస్ట్ గార్డ్ లక్షద్వీప్ దీవులలో భారీగా డ్రగ్స్‌ను పట్టుకున్నారు. రూ.1,526 కోట్ల విలువ చేసే 218 కేజీల హెరాయిన్ సీజ్ చేసినట్లు డీఆర్ఐ అధికారులు వెల్లడించారు. కేటుగాళ్లు విదేశాల నుండి సముద్ర మార్గం ద్వారా హెరాయిన్ తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు లక్షద్వీప్ దీవులలో అధికారుల బృందం మాటు వేసింది. 12 రోజుల నిరీక్షణ తరువాత రెండు బోట్లలో తరలిస్తున్న డ్రగ్స్‌ను డీఆర్ఐ అధికారులు…
కేరళలో వానలు దంచికొడుతున్నాయి. నైరుతి రుతుపవనాలు రావడానికి ముందే రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భారత వాతావరణ శాఖ ( ఐఎండీ) బుధవారం రాష్ట్రంలోని ఏడు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది. త్రిసూర్, పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్, వయనాడ్, కన్నూర్, కాసర్ గోడ్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది ఐఎండీ. గురువారం కన్నూర్, కాసర్ గోడ్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. కేరళ చుట్టుపక్కల ప్రాంతాలలో…
భారత వ్యవసాయ రంగానికి గుడ్ న్యూస్ చెప్పింది భారత వాతావరణ శాఖ ( ఐఎండీ). భారత్ లో వర్షాలకు అత్యంత కీలకంగా భావించే నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది ముందుగానే రానున్నాయి. భారత వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు జీవనాధారంగా భావించే నైరుతి రుతుపవనాలు మే 27న కేరళను తాకనున్నట్లు ఐఎండీ వెల్లడించింది. ఈ ఏడాది దేశంలో ముందస్తు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కేరళలో సాధారణంగా జూన్ 1న రుతుపవనాలు ప్రారంభం అయినా.. మొదటి,…