కేంద్ర ప్రజలపై పెట్రో భారాన్ని తగ్గించింది. పెట్రోల్, డిజిల్ పై కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని పెట్రోల్ పై రూ. 8, డిజిల్ పై రూ.6 తగ్గించడంతో లీటర్ పెట్రోల్ పై రూ. 9.5, డిజిల్ పై రూ. 7 తగ్గింది. నిన్నటి అర్థరాత్రి నుంచి తగ్గిన రేట్లు అమలులోకి వచ్చాయి. గతేడాది నవంబర్ లో దీపావళి ముందు కూడా కేంద్ర ఇదే విధంగా లీటర్ పెట్రల్ పై రూ.5, డిజిల్ పై రూ. 10 కేంద్ర ఎక్సైజ్ టాక్స్ ను తగ్గించింది. ఆ సమయంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఉండటంతో ఎలక్షన్ స్టంట్ గా ప్రతిపక్షాలు కొట్టిపారేశాయి.
ఇదిలా ఉంటే కేంద్రం బాటలో పలు రాష్ట్రాలు పయణించే అవకాశం కనిపిస్తోంది. ప్రజల్లో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలపై వ్యతిరేఖత రాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాల్యూ ఆడెడ్ టాక్స్ (వ్యాట్) ను తగ్గించుకుంటున్నాయి. తాజాగా కేరళ, రాజస్తాన్ రాష్ట్రాలు పెట్రోల్, డిజిల్ పై రాష్ట్ర పన్నులను తగ్గించుకున్నాయి. దీంతో ఈ రాష్ట్రాల్లో మరింతగా పెట్రోల్ , డిజిల్ రేట్లు తక్కువ కానున్నాయి.
శనివారం కేంద్రం పెట్రోల్, డిజిల్ రేట్లు తగ్గించిన తర్వాత కేరళ ప్రభుత్వం పెట్రోల్ పై రూ. 2.41, డిజిల్ పై రూ. 1.36 వ్యాట్ ను తగ్గించింది. ఇదే బాటలో రాజస్తాన్ ప్రభుత్వం కూడా పెట్రోల్, డిజిల్ పై టాక్సులను వరసగా రూ. 2.48, రూ. 1.16 తగ్గించింది. దీంతో ఈ రెండు రాష్ట్రాల్లో సామాన్యుడిపై మరింతగా భారం తగ్గినట్లు అయింది.
కేంద్రం నిర్ణయంతో పలు రాష్ట్రాలు కూడా పెట్రోల్, డిజిల్ పై రాష్ట్ర పన్నులను తగ్గించే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా టాక్సులు తగ్గించే అవకాశం ఉంది. దీంతో పాటు గతేడాది నవంబర్ లో కేంద్రం పన్నులను తగ్గించిన తర్వాత కూడా ఏపీ, తెలంగాణ, వెస్ట్ బెంగాల్ వంటి రాష్ట్రాలు పన్నులను తగ్గించలేదు. అయితే ఈసారి కేంద్ర నిర్ణయంతో తప్పక తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ రాష్ట్రాలు ఏవిధంగా స్పందిస్తాయో చూడాలి. ఈ ఏడాది డిసెంబర్ లో ఎన్నికలు జరుగనున్న హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు కూడా పెట్రోల్, డిజిల్ పై వ్యాట్ తగ్గించే అవకాశ ఉంది.