ఫ్రీగా వస్తే ఫినాయిల్ అయినా తాగేస్తారనే నానుడి ఇప్పటికీ ఉంది. రియాలిటీలో అది సాధ్యపడదు కానీ, దానికి తగినట్టు చాలా సందర్భాలే వెలుగు చూశాయి. ఏదైనా ఒక భారీ ఆఫర్ ప్రకటిస్తే చాలు.. జనాలు పోటెత్తిపోతారు. అప్పట్లో జియో సిమ్స్ అందుబాటులో వచ్చినప్పుడు, దేశవ్యాప్తంగా జనాలు ఎలా ఎగబడ్డారో చూసే ఉంటారు. అంతెందుకు.. హైదరాబాద్లోనే కొన్ని షాప్స్లో ఫలానా డిస్కౌంట్స్ ప్రకటించినప్పుడు దండయాత్రలే చేశారు. ఇప్పుడు కేరళలోని లులు మాల్లో అలాంటి దృశ్యాలే కనువిందు చేశాయి. మొత్తం…
భారత రాజ్యాంగంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేరళ మంత్రి పదవి ఊడిపోయింది.. కేరళ మత్స్యకార, సాంస్కృతిక శాఖ మంత్రి సాజి చెరియన్.. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి.. చెరియన్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన విపక్షాలు.. అతడిని కేబినెట్ నుంచి తొలగించాలంటూ డిమాండ్ చేశాయి.. ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టాయి.. ఇక, మంత్రి వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో.. రాష్ట్ర గవర్నర్తో పాటు సీఎం పినరయి…
కార్మికులు నిరసన వ్యక్తం చేసేందుకు దేశం అనమతించదని.. కానీ, వారిపై దోపిడీ చేసే వారిని ప్రోత్సహిస్తోందని కేరళ మంత్రి విమర్శించారు. దీని కారణంగానే కార్పొరేట్ రంగం విస్తరిస్తూ.. మిలీనియర్ల సంఖ్య పెరిగిపోతోందని ఆరోపించారు.
కేరళలో మరో వ్యాధి కలకలం రేపుతోంది. ఇప్పటికే నిఫా, స్వైన్ ఫ్లూ, కరోనా, మంకీ ఫీవర్ వంటి వ్యాధులు కేరళలో వెలుగు చూశాయి. తాజాగా ఆంత్రాక్స్ వ్యాధి కలవరపెడుతుతోంది. జంతువుల్లో ఎక్కువగా సోకే ఈ వ్యాధి, ఆ జంతువును తిన్నప్పుడు మనుషులకు కూడా సోకే అవకాశం ఉంటుంది. కేరళలోని త్రిసూర్ అతిరప్పిల్లి అటవీ ప్రాంతంలో కొద్ది రోజులుగా ఆంత్రాక్స్ వ్యాధి సోకుతోంది. దీని కారణంగా అడవి పందులు మరణిస్తున్నాయి. అయితే దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని…
కేరళలో ఎస్ఎఫ్ఐ విద్యార్థి విభాగం అల్లర్లకు కారణం అయ్యారు. ఏకంగా కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ కార్యాలయాన్ని శుక్రవారం ధ్వసం చేశారు. కేరళలోని కొండ ప్రాంతాల్లోని అడవుల చుట్టూ బఫర్ జోన్ల వల్ల కలిగే ఇబ్బందులపై రాహుల్ గాంధీ జోక్యం చేసుకోవడంలో విఫలం అయ్యారని ఆరోపిస్తూ తీవ్ర ఆందోళనలకు తెరతీసింది వామపక్ష విద్యార్థి విభాగం ఎస్ఎఫ్ఐ. ఆందోళనల్లో భాగంగా వయనాడ్ లోని రాహుల్ గాంధీ ఆఫీస్ పై పెద్ద ఎత్తున దాడికి పాల్పడ్డారు. దాడికి…
కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ముఖ్యమంత్రి పినరయి విజయన్ గద్దె దిగాలని కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆందోళన చేస్తోంది. కేరళ వ్యాప్తంగా యూత్ కాంగ్రెస్ నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ తెలిపిన ఓ నిరసన తెగ వైరల్ అవుతోంది. సీఎం విజయన్ కు వ్యతిరేకంగా యూత్ కాంగ్రెస్ నేతలు ఎగురుతున్న విమానంలో నినాదాలు చేశారు. సోమవారం కన్నూర్ నుంచి తిరువనంతపురం వెళ్తున్న విమానంలో కాంగ్రెస్ కార్యకర్తలు నల్లచొక్కాలు ధరించి విజయన్ రాజీనామా చేయాలని…