నైరుతి రుతుపవనాలు మరికొన్ని రోజుల్లో కేరళ తీరాన్ని తాకనున్నాయి. సాధారణం కన్నా ఐదు రోజుల ముందే మే 27న నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయి. ఈ లోపే కేరళలో వర్షాలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదు అవుతున్నాయి. దీంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తం అయింది. 10 జిల్లాల్లో శని, ఆదివారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ఇప్పటికే హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. తిరువనంతపురం, కొల్లం, పతనంతిట్ట, అలప్పుజా, కొట్టాయం, ఎర్నాకులం, ఇడుక్కి, త్రిసూర్, మలప్పురం, కోజికోడ్ జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. వయనాడ్ జిల్లాలో కూడా భారీ వర్షాలు నమోదు అవుతాయని ఐఎండీ హెచ్చరించింది.
భారీ వర్షాలు సూచనలతో కేరళ అధికారులు అప్రమత్తం అయ్యారు. పలు డ్యాంల గేట్లను ఓపెన్ చేసి నీటిని కిందికి వదులుతున్నారు. ఇడుక్కి జిల్లాలోని కల్లార్ కుట్టి డ్యాం వద్ద నీటి మట్టం 455 మీటర్ల రెడ్ అలెర్ట్ స్థాయికి చేరడంతో 300 క్యుసెక్కుల నీటని విడుదల చేశారు. కొండపాక జిల్లాలో పాంబ్లా రిజర్వాయర్ 500 క్యూసెక్కుల నీటిని కిందికి వదిలారు. పెరియార్ నది ఒడ్డున ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ సూచించింది. దీంతో పాటు ఉత్తర కేరళ తీరం వెంబడి గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ కేంద్ర వెల్లడించింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించింది.
మే 12 నుంచి 18 వరకు కేరళలో 237 శాతం అధిక వర్షపాతం నమోదు అయిందని… అయితే సాధారణంగా ఈ కాలంలో కేవలం 47.3 మిల్లీమీటర్ల వర్షపాతమే కురవాలి, కేరళలో మాత్రం 159.3 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదు అయింది. సాధారణంగా 24 గంటల్లలో 20 సెంటీమీటర్ల కన్న ఎక్క వర్షపాతం నమోదు అయితే రెడ్ అలెర్ట్ జారీ చేస్తారు. 6 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు అయ్యే అవకాశం అంటే ఆరెంజ్ అలెర్ట్, 6 సెంటీమీటర్ల నుంచి 11 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉంటే ఎల్లో అలెర్ట్ జారీ చేస్తుంది వాతావరణ శాఖ.