మనం గుడికి వెళితే కోరిక కోర్కెలు తీర్చు దేవుడా అంటూ మొక్కుకుంటాం. అదిజరిగితే మొక్కులు తప్పకుండా చెల్లించుకుంటాం అంటూ ప్రదర్శనలు చేస్తాం. దీపాలు పెడుతూ అమ్మవారికి స్తోత్రాలు పాడుతూ స్మరించుకుంటాం. మనం ఇళా గుడికి వెళ్ళి భక్తితో చేస్తే అమ్మవారు కరుణిస్తుందని ఓనమ్మకం. సాధారణంగా మనం దేవుణ్ని కీర్తిస్తాం. కానీ ఓగుడిలో మాత్రం దీనికి విరుద్దంగా ఉంటుంది. ఆ గుడికి వెళితే మొక్కుకోవడం ఏమో కానీ.. అమ్మవారికి నానా తిట్లు తిట్టాలట. ఏంటీ ఆలయంలో అమ్మవారిని తిట్టాలా అనుకుంటున్నారా. అయితే కేరళలోని కొడుంగల్లూర్ ఆలయం గురించి తెలుసుకుందాం పదండి.
కేరళలోని కొడుంగల్లూర్ భగవతీ ఆలయం, అమ్మవారిని ఇక్కడి జనం మొక్కుకోరు నానా తిట్టు తిడతారు. ఈగుడి ప్రత్యేకత ఇది. ఏటా ఇక్కడ 7 రోజులపాటూ ఉత్సవాలు జరుగుతాయి. ఆ టైమ్‌లో భక్తులు.. కత్తులతో ఎంట్రీ అవుతారు. తలపై దాడి చేసుకుంటారు. రక్తం ప్రవాహంలా కారుతున్నా పట్టించుకోరు.. అలాగే గుళ్లోకి వెళ్తారు. భద్రకాళీ అమ్మవారిని నానా తిట్లు తిడతారు. తిట్ల దండకమే కాదు… భక్తి గీతాల రూపంలో కూడా తిట్టిపోస్తారు. అక్కడితో అయిపోదు. పూనకం వచ్చినట్లు ఊగిపోతూ… గుడిపైకి రాళ్లు విసురుతారు. ఏటా రాళ్లతో కొడుతుండటం వల్ల ఆలయం దెబ్బతింటోంది. ఇక్కడ పూజా-కైంకర్యాలు, కొబ్బరికాయలు కొట్టడాలు లాంటివి ఉండవు. 7 రోజుల ఉత్సవాల తర్వాత.. వారం పాటూ ఆలయాన్ని మూసివేస్తారు. ఆ టైమ్‌లో… రక్తపు మరకల్ని శుభ్రం చేస్తారు. ఆలయ అధికారులు. కానీ అక్కడి ఆలయంలో అలా ఎందుకు చేస్తారో ఇప్పటికి ఎవరికి అంతుచిక్కని రహస్యం దాగి వుండటం అందరికి ప్రశ్నార్థంగా మారింది.