కరోనా మహమ్మారి నుంచి దేశం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. 2020 నుంచి దేశాన్ని మహమ్మారి పట్టిపీడిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా చాలా రంగాలు దెబ్బతిన్నాయి. అందులో పర్యాటక రంగం కూడా ఒకటి. కరోనా కారణంగా పర్యాటక రంగం భారీగా దెబ్బతిన్నది. దీనిపై ఆధారపడిన వేలాది మంది పూర్తిగా నష్టపోయారు. ఇలా నష్టపోయిన వారిలో కేరళకు చెందిన రాయ్ టూరిజం కూడా ఒకటి. రాయ్ టూరిజంకు 20 టూరిస్ట్ బస్సులు ఉన్నాయి. కరోనా కారణంగా…
మనుషులే కాదు జంతువులు కూడా పగపడుతుంటాయి. పాములు పగపడుతుంటాయని చెబుతుంటారు. అంతేకాదు, ఈగ పగపై ఏకంగా టాలీవుడ్లో రాజమౌళి సినిమా కూడా తీసిన సంగతి తెలిసిందే. అయితే, కాకులు ఓ కోతిపై పగబట్టడం ఎక్కడైనా చూశారా అంటే లేదని చెబుతాం. కేరళలోని ఎర్నాకులంలో మవట్టుపూజాలో ఓ కోతికి కాకుల గుంపు నరకం చూసిస్తున్నాయి. ఎక్కడికి వెళ్లినా సరే వెంటబడి తరుముతున్నాయి. ముక్కులతో పొడుస్తున్నాయి. ఎవరైనా సహాయం చేద్దామని ముందుకు వస్తే వారినిపై కూడా కాకులు దాడి చేస్తున్నాయి.…
మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. పురుషులతో సమానంగా వారితో కలిసి వారు చేసే పనులను మహిళలు సైతం చేస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. సాధారణంగా ఉద్యోగాలు అన్నింటిలోకి కష్టమైన ఉద్యోగం స్నేక్ క్యాచింగ్. ఇందులో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలు పోతాయి. అయితే, కొంతమంది ఇలాంటి రిస్క్ ఉద్యోగాలను కూడా చాలా ఇష్టంగా చేస్తుంటారు. విజయాలు సాధిస్తుంటారు. ఇలాంటి వారిలో రోహిణి కూడా ఒకరు. Read: కరుగుతున్న గ్రీన్లాండ్… ఇలానే కొనసాగితే ప్రపంచం… కేరళకు చెందిన రోహిణి…
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నా కేరళ రాష్ట్రంలో కేసులు భారీ సంఖ్యలో నమోదువుతున్నాయి. కేరళ రాష్ట్రంలో 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో 51,887 కరోనా కేసులు నమోదైనట్టు కేరళ ఆరోగ్యశాఖ ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో కరోనాతో 1205 మంది మృతి చెందారు. కేసులు, మరణాల సంఖ్య భారీగా పెరగడంతో రాష్ట్రప్రభుత్వం అలర్ట్ అయింది. కేరళలో నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నప్పటికీ కేసులు పెరుగుతుండటంతో అధికారులు మరింత కఠినంగా నిబంధనలు అమలుచేసేందుకు సిద్దమవుతున్నారు. Read: నావికా…
దేశమంతా గణతంత్ర దినోత్సవాలు ఘనంగా జరుపుకుంటోంది. కేరళలో మంత్రి అహ్మద్ దేవరకోవిల్ పొరపాటు పడ్డారు. ఆయన ఎగరేసిన జాతీయ జెండా తలకిందులు అయినట్టు మీడియా చెబితే అర్థమయింది. మంత్రి, జిల్లా కలెక్టర్‌తో పాటు గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొన్న అధికారులు కూడా తలకిందులైన జాతీయ జెండాకు సెల్యూట్ చేయడం గమనార్హం. READ ALSO దేశంలో భారీగా తగ్గిపోతున్న గాడిదల సంఖ్య.. కారణం ఏంటంటే? ఈ విషయాన్ని పాత్రికేయులు గుర్తించి, అధికారుల దృష్టికి తీసుకెళ్ళడంతో తిరిగి మరోమారు జెండా ఎగరేయాల్సి…
ఐఏఎస్ క్యాడర్ రూల్స్ మార్చేందుకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం.. కొన్ని సవరణలను ప్రతిపాదించింది.. కానీ, అప్పుడే రాష్ట్రాలు.. కేంద్రం తీరును వ్యతిరేకిస్తున్నాయి.. తాజాగా, ఈ జాబితాలో మరో రెండు రాష్ట్రాలు చేరాయి.. ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖలు రాశారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, కేరళ సీఎం పినరాయి విజయన్.. కేంద్రం ప్రతిపాదనలపై తమ లేఖలో ఇద్దరు సీఎంలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కాగా, ఇప్పటికే కేంద్రం ప్రతిపాదనలను పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్…
బీజేపీయేతర పాలిత రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపిస్తుందా? కావాలనే శకటాలను ఎంపిక చేయలేదా? అన్న ప్రశ్నలు మరోసారి తెరమీదకు వచ్చాయి. రిపబ్లిక్ డే శకటాల విషయంలో.. కేంద్ర-రాష్ట్రాల మధ్య మరో వివాదం రాజుకుంది. అయితే దీనితో తమకు సంబంధం లేదని చెబుతోంది కేంద్రం. గణతంత్ర వేడుకల్లో కొన్ని రాష్ట్రాల శకటాలకు ప్రాతినిధ్యం లభించకపోవడం పట్ల కేంద్రం, ఆయా రాష్ట్రాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు మొదలయ్యాయి. తెలుగు రాష్ట్రాల శకటాలకు మరోసారి అనుమతి దక్కలేదు. రిపబ్లిక్ డే వేడుకల్లో…
కేరళలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో 34,199 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 8,193 మంది కరోనా నుంచి కోలుకోగా, 49 మంది మృతి చెందారు. కేరళలో ఇప్పటి వరకు 51,160 మంది కరోనాతో మృతి చెందినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇక రాష్ట్రంలో మొత్తం 1,68,383 యాక్టీవ్ కేసులు ఉన్నట్టు కేరళ ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. మొదటి వేవ్‌ను కేరళ సమర్థవంతంగా ఎదుర్కొనగా, రెండో వేవ్‌లో అత్యధిక కేసులతో పాటు మరణాలు…