కేరళలో బీజేపీ సరికొత్త చరిత్ర సృష్టించింది. నాలుగు దశాబ్దాల వామపక్షాల కంచుకోటను బద్దలు కొట్టింది. తొలిసారి తిరువనంతపురం మేయర్ స్థానాన్ని కాషాయ పార్టీ కైవసం చేసుకుంది. బీజేపీ నేత వీవీ.రాజేష్ మేయర్‌గా ఎన్నికయ్యారు.
Viral Video: దేశంలో ప్రతిరోజు అనేకచోట్ల ప్రజల వద్ద నుంచి అక్రమంగా లేదా సరైన లెక్కలు లేని ధనాన్ని పోలీసులు చెకింగ్ సమయంలో సీజ్ చేయడం చూసే ఉంటారు. ఇలాంటివి ఎక్కువగా ఎన్నికల సమయంలో కనబడుతుంటాయి. ప్రతిరోజు అనేకమంది వారికి వ్యాపారాల నిమిత్తం లేదా వేరే అవసరాలకైనా పెద్ద మొత్తంలో కొందరు డబ్బులను ఒకచోటి నుంచి మరొక చోటికి తరలిస్తూ ఉంటారు. ఇందుకు సంబంధించి సరైన ఆధారాలు లేదా బిల్లులను చూపిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలా…
Rajeev Chandrasekhar: కేరళ బీజేపీ అధ్యక్షుడు , మాజీ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కోజికోడ్‌లో కేంద్ర మంత్రివర్గంలో ముస్లింలకు ప్రాతినిధ్యం లేదని చెప్పిన తర్వాత రాజకీయ దుమారం చెలరేగింది. మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Kerala: 10 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన బీజేపీ కార్యకర్త, పాఠశాల ఉపాధ్యాయుడికి శనివారం కోర్టు జీవితఖైదు విధించింది. తలస్సేరి ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు కడవత్తూర్ నివాసి పద్మరాజన్ కే అలియాస్ పప్పెన్ మాస్టర్(48)కి శిక్షను ఖరారు చేసింది. 2020 జనవరి, ఫిబ్రవరి మధ్య కన్నూర్ లోని పలతాయిలో పనిచేస్తున్న సమయంలో, మైనర్ బాలికపై పదే పదే లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో దోషిగా తేలాడు.
కేరళలోని కొచ్చి అకస్మాత్తుగా జలఖడ్గం విరుచుకుపడింది. తుఫాన్ కారణంగానో.. లేదంటే భారీ వరదలు కారణంగానో కాదు. ఊహించని రీతిలో అర్ధరాత్రి వచ్చిన పెను ముప్పు కారణంగా మొత్తం ఇళ్లను ముంచేశాయి. దీంతో వాహనాలు, వస్తువులు నీటిలో కొట్టుకుపోయాయి. ప్రాణాపాయం తప్పినా.. భారీగా నష్టమైతే జరిగింది.
కేరళ సరికొత్త చరిత్రను సృష్టించింది. దేశంలోనే తొలి పేదరికం లేని రాష్ట్రంగా అవతరించింది. ఈ మేరకు కేరళ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ శనివారం ప్రకటించారు. భారతదేశంలోనే పేదరికాన్ని నిర్మూలించిన మొదటి రాష్ట్రంగా కేరళ నిలిచిందని వెల్లడించారు.
కేరళలో పినరయి విజయన్ ప్రభుత్వం సరికొత్త చరిత్ర సృష్టించింది. పేదరికాన్ని నిర్మూలించేందుకు ప్రభుత్వం అనుసరించిన విధానాలు విజయవంతమయ్యాయి. దీంతో ‘‘అత్యంత పేద రహిత రాష్ట్రం’’గా కేరళ అవతరించింది. ఈ మేరకు నవంబర్ 1న కేరళ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధికారికంగా ప్రకటించనున్నారు. సినీ తారలు మమ్ముట్టి, మోహన్ లాల్, కమల్ హాసన్ సమక్షంలో ఈ ప్రకటన చేయనున్నారు.
కేరళలోని కన్నూర్ జిల్లాలో ఎమ్మెల్యే కేపీ.మోహనన్‌కు చేదు అనుభవం ఎదురైంది. తమ సమస్యలు పట్టించుకోవడం లేదని స్థానికులు తీవ్ర ఆగ్రహం చేశారు. అంగన్వాడీ కేంద్రం ప్రారంభించేందుకు ఎమ్మెల్యే రాగానే స్థానికులు నిలదీశారు.
High Court: బిచ్చగాడు అయిన భర్తను, భార్య భరణం కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై కేరళ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. బిక్షాటన చేస్తూ బతికే తన అంధుడైన భర్త నుంచి భరణం కోరుతూ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు తీర్పు చెప్పింది. ‘‘ఒక బిచ్చగాడిని తన భార్యకు భరణం చెల్లించమని బలవంతం చేయకూడదు’’ అని వ్యాఖ్యానించింది. అదే సమయంలో, నిరుపేద జీవిత భాగస్వాములకు ఆహారం, దుస్తులు అందేలా చూసుకోవడానికి రాష్ట్రం జోక్యం చేసుకోవాలని ఆదేశించింది.