ఢిల్లీ ఆప్ ప్రభుత్వంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విరుచుకుపడ్డారు. ఫిబ్రవరి 5న ఆప్ విపత్తు పోతుందని జోస్యం చెప్పారు. శనివారం జేఎల్‌ఎన్ స్టేడియంలో జరిగిన ‘‘జుగ్గి బస్తీ ప్రధాన్ సమ్మేళన్’’ కార్యక్రమంలో అమిత్ షా పాల్గొని కేజ్రీవాల్ లక్ష్యంగా ధ్వజమెత్తారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు లిక్కర్ పాలసీ వ్యవహారం తాజాగా మరోసారి కాక రేపుతోంది. మద్యం పాలసీ కారణంగా ప్రభుత్వానికి రూ.2,026 కోట్ల నష్టం వాటిల్లినట్లుగా కాగ్ పేర్కొన్నట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల ఫీవర్ వచ్చేసింది. త్వరలోనే హస్తినలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది.
దేశ రాజధాని ఢిల్లీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ ఆప్ అభ్యర్థులను ప్రకటించేసింది. అభ్యర్థులంతా ఎన్నికల ప్రచారంలో బిజీ అయిపోయారు.
కొత్త సంవత్సరంలో దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. త్వరలో ఓటర్ల తుది జాబితాను ప్రకటించనుంది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై రాజకీయ ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంది. మహిళల భద్రత, రాజధానిలో పెరుగుతున్న నేరాల గ్రాఫ్‌ను ఎన్నికల ముందు పెద్ద సమస్యగా మార్చాలని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నిస్తోంది. గత నెల రోజుల నుంచి ఢిల్లీలో శాంతిభద్రతలు, మహిళా భద్రతపై కేజ్రీవాల్ కేంద్రాన్ని నిందిస్తున్నారు. వీటిని ఆయుధంగా మలచుకున్నట్లు కనిపిస్తోంది. ఈ అంశాల్లో కేంద్రం పూర్తిగా విఫలమైందని జనాలను నమ్మించి.. ఓట్లు దండుకునేందుకు యత్నిస్తున్నారని పలువురు ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఢిల్లీ ప్రభుత్వం కాలం 2025, ఫిబ్రవరితో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో జనవరిలోనే శాసనసభ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది.
ఢిల్లీ మాజీ మంత్రి కైలాష్ గహ్లోత్ ఢిల్లీ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. స్పీకర్ రామ్ నివాస్ గోయెల్‌కు రాజీనామా లేఖను పంపించారు. ఇటీవలే కైలాష్ గహ్లోత్ ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు.
వచ్చే ఏడాదే దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీకి కొత్త ఊపు వచ్చింది. ఆప్ అభ్యర్థి మహేశ్‌కుమార్ ఖిచి జయకేతనం ఎగరేశారు.