దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల ఫీవర్ వచ్చేసింది. త్వరలోనే హస్తినలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఇదిలా ఉంటే అధికార పార్టీ ఆప్ ఇప్పటికే అభ్యర్థుల జాబితాను ప్రకటించడం.. ప్రచారంలో కూడా దూసుకుపోతోంది. ఇంకోవైపు కొత్త కొత్త పథకాలు ప్రకటించుకుంటూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. తాజాగా బీజేపీ కూడా ఎన్నికల శంఖారావానికి పూనుకున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం ప్రధాని మోడీ… ఢిల్లీలో గృహ నిర్మాణ ప్రాజెక్టును ప్రారంభించారు. మురికవాడ ప్రజలకు ఇళ్లు పంపిణీ చేశారు. దీంతో హస్తినలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టినట్లైంది.
ఇది కూడా చదవండి: BSS : ‘బెల్లంబాబు’ బర్త్ డే.. 4 సినిమాల స్పెషల్ అప్డేట్స్
ఇదిలా ఉంటే.. ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. బీజేపీ తొలి జాబితాను ప్రకటించేందుకు రంగం సిద్ధం చేస్తుండగా.. వీరేంద్ర సచ్‌దేవ్ మాత్రం ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హైకమాండ్.. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తుండగా ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy : మంచినీటి సరఫరాపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
ఫిబ్రవరితో ఢిల్లీ ప్రభుత్వం కాలం ముగుస్తోంది. దీంతో త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. 2015 నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ.. ఢిల్లీలో అధికారంలో ఉంది. 2014 నుంచి మాత్రం ఆప్.. ఒక్క లోక్‌సభ సీటు కూడా గెలవలేకపోయింది. మొత్తం ఏడింటిని బీజేపీ కైవసం చేసుకుంది. ఇక రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్-బీజేపీ మధ్యనే ప్రధాన పోటీ ఉండబోతుందని తెలుస్తోంది. రెండు పార్టీల మధ్య హోరాహోరీగా పోరు జరగొచ్చని సమాచారం. ఇప్పటికే కేజ్రీవాల్ లక్ష్యంగా పోస్టర్ వార్ చేపట్టింది. కేజ్రీవాల్ చాలా రిచ్ అంటూ బీజేపీ పోస్టర్లు విడుదల చేసింది. అధికారాన్ని నిలుపుకోవడం కోసం ఆప్ ఓటర్లను మోసం చేస్తోందని.. అలాగే కేజ్రీవాల్ ‘గోట్) (ఆల్ టైమ్ గ్రేటెస్) అంటూ టైటిల్ పెట్టింది. ఇక జనవరి 1న కేజ్రీవాల్‌కు బీజేపీ చీఫ్ దేవేంద్ర లేఖ రాశారు. అబద్ధాలు, మోసం చేసే చెడు అలవాట్లను వదిలేయాలని కోరారు. మద్యాన్ని ప్రోత్సహించినందుకు కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ ఓటర్లను ఆప్ తొలగిస్తోందని బీజేపీ ఆరోపించింది. అలాగే బీజేపీపై కూడా ఆప్ ఆరోపణలు చేసింది. ఆప్ సానుభూతిపరుల ఓట్లు తొలిగించాలని చూస్తోందని కేజ్రీవాల్ ధ్వజమెత్తారు.
ఇది కూడా చదవండి: Bhatti Vikramarka: గ్రీన్ ఎనర్జీ అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా తెలంగాణ..