హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అంశంపై కాంగ్రెస్‌తో ఆమ్ ఆద్మీ పార్టీ సుదీర్ఘ మంతనాలు జరిపింది. కానీ చర్చలు మాత్రం ఓ కొలిక్కి రాలేదు. ఇంకోవైపు సునీతా కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారం కూడా మొదలెట్టేశారు. ఈ నేపథ్యంలో రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందా? లేదా? అనేది మాత్రం తేలలేదు. మొత్తానికి ప్రతిష్టంభన మధ్య ఆప్ సోమవారం తొలి జాబితాను విడుదల చేసేసింది. 20 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ప్రకటించింది.
హర్యానాలో ఆమ్ ఆద్మీ-కాంగ్రెస్ మధ్య పొత్తు బెడిసికొట్టినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. రెండు రోజులుగా సీట్ల పంపకాలపై ఇరు పార్టీల నేతలు సుదీర్ఘ మంతనాలు జరుపుతున్నారు. కానీ చర్చలు మాత్రం కొలిక్కి రాలేదు. దీంతో పంచాయితీ మళ్లీ మొదటికొచ్చింది.
హర్యానాలో కాంగ్రెస్-ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య సీట్ల పంపకం పంచాయితీ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. మంగళవారం సాయంత్రం ఇరు పార్టీల నేతలు సుదీర్ఘ మంతనాల తర్వాత సీట్ల పంపకాలు జరిగినట్లుగా సమాచారం అందుతోంది. ఆప్ 10 సీట్లు అడగ్గా.. ఐదు నుంచి ఏడు సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Liquor Policy Case: ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్ లో కవితనే కీలక సూత్రధారి, పాత్రధారి అని ఆరోపించింది సీబీఐ. ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల ముడుపులు, లిక్కర్ పాలసీ రూపకల్పన, సౌత్ గ్రూప్ నుంచి డబ్బులను సమకూర్చడం.. ఇలా ప్రతిదీ కవిత కనుసన్నల్లోనే జరిగాయని అభియోగం గావించింది. ఈ కేసులో ఇప్పటికే పలు మార్లు కవిత బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేయగా.. సాక్షులుగా ఉన్నవారిని ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉందని ఈడీ, సీబీఐ…
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం ఢిల్లీ చేరుకున్నారు. పర్యటనలో భాగంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్, ఆయన తల్లిదండ్రులను మమత పరామర్శించారు.
ఢిల్లీ ఆమ్ ఆద్మీ మంత్రి అతిషిపై శనివారం పరువు నష్టం కేసు నమోదైంది. రౌస్ అవెన్యూ కోర్టులో ఢిల్లీ బీజేపీ మీడియా చీఫ్ ప్రవీణ్ శంకర్ కపూర్ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. దీనిని రౌస్ అవెన్యూ కోర్టు విచారణకు స్వీకరించింది.
ఆమ్ ఆద్మీ రాజ్యసభ సభ్యురాలు, మాజీ మహిళా కమిషనర్ స్వాతి మాలివాల్‌పై దాడి కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహయకుడు బిభవ్ కుమార్ జ్యుడీషియల్ కస్టడీని తీస్ హజారీ కోర్టు మరోసారి పొడిగించింది.
అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ ఆర్డర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసింది. దీనిపై విచారణ కొనసాగుతోంది. న్యాయమూర్తులు సుధీర్ కుమార్ జైన్, రవీందర్ దూదేజాలతో కూడిన వెకేషన్ బెంచ్ ఈ కేసును విచారిస్తోంది.
ఆమ్ ఆద్మీ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తుందని ఆప్ గురువారం ధృవీకరించింది. లోక్‌సభ ఎన్నికల కోసమే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నామని, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అది కుదరదని ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ అన్నారు.
చంద్రబాబుకు సీఎస్, డీజీపీ శుభాకాంక్షలు సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని అందుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.. ఈ రోజు ఉదయం చంద్రబాబు నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు ఏపీ సీఎఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా.. ఇక, చంద్రబాబును కలిసిన వారిలో పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు.. మాజీ డీజీపీ ఆర్పీ ఠాగూర్ సైతం కాబోయే ఏపీ సీఎంకు శుభాకంక్షలు తెలిపారు.. బీజేపీ గెలిచిన 8 చోట్ల బీఆర్ఎస్ 7 చోట్ల డిపాజిట్…