ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ఎట్టకేలకు ప్రభుత్వ బంగ్లా కేటాయించబడింది. ఏడాది తర్వాత కొత్త బంగ్లాను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నవంబర్ 4, 2024న ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేశారు. వాస్తవంగా 10 రోజుల్లోనే జాతీయ అధ్యక్షుడికి ఢిల్లీలో అధికారికంగా ప్రభుత్వ బంగ్లాను ఏర్పాటు చేయాలి..
దేశ సర్వోన్నత న్యాయస్థానంలో సోమవారం అమానుష ఘటన చోటుచేసుకుంది. భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్.గవాయ్‌పై ఓ వృద్ధ న్యాయవాది రాకేశ్ కిషోర్(71) ఊహించని రీతిలో షూ విసిరేందుకు ప్రయత్నించాడు.
దేశ రాజధాని ఢిల్లీని వరదలు ముంచెత్తాయి. బుధవారం ఉదయం నుంచి కురిసిన వర్షానికి రహదారులన్నీ చెరువులను తలపించాయి. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా అధికారిక నివాసం దేశ రాజధానిలోని రాజ్ నివాస్ మార్గ్‌లో కేటాయించబడింది. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాక... ఇన్ని రోజులకు అధికారిక నివాసం కేటాయించబడింది. ప్రస్తుతం సొంత నియోజకవర్గం షాలిమార్ బాగ్‌లో తన ఇంట్లో నివాసం ఉంటున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయింది. పార్టీ కార్యక్రమాలు అంత చురుగ్గా కనిపించడం లేదు. కార్యకర్తలు కూడా నిరాశలోకి వెళ్లిపోయారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు ఎట్టకేలకు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ అధికారిక నివాసాన్ని కేటాయించింది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. అనంతరం రేఖా గుప్తాకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లభించింది.
ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోకముందే తాజాగా మరో ఝలక్ తగిలింది. 13 మంది ఢిల్లీ కౌన్సిలర్లు ఆప్‌కు రాజీనామా చేశారు. తిరుగుబాటు కౌన్సిలర్లంతా కొత్త పార్టీకి శ్రీకారం చుట్టారు. ముఖేష్ గోయెల్ నాయకత్వంలో ఇంద్రప్రస్థ వికాస్ పార్టీ పేరు ప్రకటించారు.
స్కూల్ ఫీజుల పెంపును ఏ మాత్రం సహించబోమని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా హెచ్చరించారు. ఫీజుల పెంపును నిరసిస్తూ తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. దీంతో మోడల్ టౌన్‌లోని క్వీన్ మేరీ స్కూ్ల్ యాజమాన్యం పిల్లల్ని వేధించడం ప్రారంభించింది.
ఆప్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు కేజ్రీవాలపై ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. కేజ్రీవాల్ సహా ఇతరులపై ఎఫ్ఐఆర్ బుక్ చేసినట్లుగా రౌస్ అవెన్యూ కోర్టుకు పోలీసులు నివేదిక సమర్పించారు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీలో సంస్థాగత మార్పులకు అధిష్టానం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా శుక్రవారం ఆప్ అధినేత కేజ్రీవాల్ నేతృత్వంలో పార్టీ నేతలు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలువురి సీనియర్లకు కీలక బాధ్యతలు అప్పగించారు.