Kejriwal: అతి త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ సన్నద్ధమవుతోంది. పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన భార్యతో కలిసి మాతా వైష్ణో దేవిని దర్శించుకునేందుకు వెళ్లనున్నారు. తన ప్రయాణం గురించి సమాచారాన్ని అరవింద్ కేజ్రీవాల్ సోషల్ మీడియా ద్వారా అందించాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ తొలిసారిగా మాతా వైష్ణోదేవిని దర్శించుకోనున్నారు. ఢిల్లీలో లిక్కర్ పాలసీ స్కామ్ ఆరోపణలపై జైలు నుంచి విడుదలైన…
దేశంలో మరో రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇటీవలే హర్యానా, జమ్మూకాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. త్వరలో మహారాష్ట్ర, జార్ఖండ్‌లో జరగనున్నాయి. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ.. హర్యానా, జమ్మూకాశ్మీర్‌లో పోటీ చేసి ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబట్టలేకపోయింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషికి ఎట్టకేలకు పీడబ్ల్యూడీ అధికారులు అధికారిక నివాసం కేటాయించారు. మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఖాళీ చేసిన బంగ్లాలోకి సోమవారం అతిషి షిప్ట్ అయ్యారు. వస్తువులన్నీ తరలించారు.
హర్యానా ఎన్నికల ఫలితాలు ఇండియా కూటమిలో చీలికలు తెచ్చేలా కనిపిస్తోంది. హర్యానా ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునేందుకు ఆప్ తీవ్ర ప్రయత్నం చేసింది. కానీ హస్తం పార్టీ మాత్రం.. రెండు, మూడు సీట్లు కంటే ఎక్కువ ఇవ్వలేమని తేల్చి చెప్పడంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగింది.
ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్- ఆప్ ప్రభుత్వం మధ్య మరోసారి మాటల యుద్ధం నడుస్తోంది. రెండ్రోజుల క్రితమే ముఖ్యమంత్రి అతిషి.. మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఖాళీ చేసిన అధికారిక బంగ్లాలోకి షిప్ట్ అయ్యారు. అయితే తాజాగా బంగ్లా నుంచి అతిషికి సంబంధించిన వస్తువులను బలవంతంగా తొలగించి సీలు చేశారు.
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ అనూహ్య విజయం సాధించింది. ఎట్టకేలకు ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపు ఖాతా తెరిచింది. దోడా అసెంబ్లీ నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి మేహరాజ్ మాలిక్ విజయం సాధించారు. తన సమీప బీజేపీ ప్రత్యర్థి గజయ్ సింగ్ రాణాపై ఆయన 4,770 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషికి ఢిల్లీ పోలీసులు జెడ్ కేటగిరీ భద్రత కల్పించారు. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు అతిషికి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ వర్తిస్తుంది. ప్రోటోకాల్ ప్రకాశం ఆమె కాన్వాయ్‌లో ఇకపై పైలట్ సహా పోలీసు సిబ్బందితో భద్రత కల్పించనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.
ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషి ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే.సక్సేనా.. అతిషిచే ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఆప్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా, ఆప్ నేతలు, తదితరులు హాజరయ్యారు.
ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ హర్యానాలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. పలు నియోజకవర్గాల్లో ఎన్నికల ర్యాలీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్యానాలో ఏ ప్రభుత్వం కొలువుదీరినా ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతుతోనే సాధ్యమవుతుందన్నారు. ఆప్ మంచి స్థాయిలో స్ధానాలను చేజిక్కించుకుంటుందని తెలిపారు. తమ పార్టీ మద్దతు లేకుండా ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం కాదని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు.
kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) వినయ్ సక్సేనాతో భేటీ కానున్నారు. సీఎం పదవికి రాజీనామా చేసి కొత్త పేరును సమర్పించనున్నారు. దీనికి ముందు, ఉదయం 11:30 గంటలకు కేజ్రీవాల్ నివాసంలో ఆప్ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కొత్త సీఎం పేరు చర్చించి, ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. Mookuthi Amman 2 : బ్లాక్ బస్టర్ సీక్వెల్‌లో లేడీ సూపర్ స్టార్..…