పంజాబ్‌లోని లూథియానా వెస్ట్ ఉప ఎన్నికకు ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజీవ్ అరోరాను అభ్యర్థిగా నిలబెట్టింది. ఈ మేరకు అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటించింది. లూథియానా వెస్ట్ ఎమ్మెల్యే గురుప్రీత్ గోగి చనిపోయారు. దీంతో ఈ స్థానంలో ఉప ఎన్నిక అనివార్యమైంది.
Delhi : నేడి నుంచి రాజధాని ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు షురూ కానున్నాయి. 27 సంవత్సరాల తర్వాత బీజేపీ అధికార పార్టీలో, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిపక్షంలో కూర్చోనుంది.
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్‌ను కష్టాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో అధికారం కోల్పోయి.. నిరాశలో ఉన్న కేజ్రీవాల్‌కు కేంద్రం షాకిచ్చింది. ‘శీష్ మహల్’ అక్రమాలపై దర్యాప్తునకు కేంద్రం ఆదేశించింది
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమి తర్వాత.. పంజాబ్ ప్రభుత్వంలో గుబులు మొదలైంది. భగవంత్ సింగ్ మాన్ ప్రభుత్వంలో విభేదాలు తలెత్తినట్లుగా వార్తలు వ్యాప్తి చెందుతున్నాయి.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘోరంగా ఓడిపోయింది. కేవలం 22 సీట్లకే పరిమితం అయింది. అంతేకాకుండా ఆప్ అధినేత కేజ్రీవాల్ సహా ముఖ్య నాయకులంతా ఓటమిలో వరుస క్యూ కట్టారు. ముఖ్యమంత్రిగా ఉన్న అతిషి మాత్రం కల్కాజీ నియోజకవర్గం నుంచి స్వల్ప మెజార్టీతో గట్టెక్కారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమి తర్వాత పంజాబ్ ప్రభుత్వం అప్రమత్తం అయినట్లు తెలుస్తోంది. 2027లోనే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం పంజాబ్‌లోనే ఆప్ ప్రభుత్వం ఉంది.
ఆమ్ ఆద్మీ పార్టీ అంటే గుర్తుకొచ్చేది కేజ్రీవాల్, మనీష్ సిసోడియానే. ఆప్ పార్టీని స్థాపించిన దగ్గర నుంచి ముందుండి విజయ తీరాలకు నడిపించిన నాయకులు. దశాబ్ద కాలం పాటు హస్తినలో చక్రం తిప్పిన నాయకులు. అంతటి ఉద్దండులు.. ఒక్క లిక్కర్ స్కామ్ వారి క్రెడిబిలిటీ మీద దెబ్బ కొట్టింది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు ఆప్ ఎమ్మెల్యే అభ్యర్థుల కొనుగోలు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. 16 మంది ఆప్ అభ్యర్థుల కొనుగోలుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆప్ అధినేత కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఎవరికి గుణపాఠం నేర్పిస్తున్నాయి. ఎవరికి లాభం చేకూరుస్తున్నాయి. తేలాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే. హస్తినలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అంతేకాకుండా భారీగానే పోలింగ్ నమోదైంది. ఉదయం నుంచి ఓటర్లు పోటెత్తారు. ఇక పోలింగ్ అనంతరం ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చేశాయి.