అసెంబ్లీ చర్చలకి రాని దద్దమ్మలు 4గంటలు మీడియాలో కూర్చున్నారని కేసీఆర్ ను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పైన చర్చకు సిద్ధమా..? అని ప్రశ్నించారు. కేసీఆర్ అద్భుతం అంటున్నాడని.. కాళేశ్వరం దగ్గరనే చర్చ పెడుదం రా.. అని సవాల్ విసిరారు.
మాజీ ముఖ్యమంత్రి తాను ఒక్కడే తెలంగాణ తెచ్చానని చెప్పుకుంటారని.. అది పచ్చి అబద్ధమన్న విషయం ప్రజలందరికీ తెలుసని కోదండ రామ్ అన్నారు. కాజిపేట్, మడికొండలో జరిగిన జన జాతర సభలో ఆయన మాట్లాడుతూ.. కడియం కావ్యకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.
రాముల వారి పై ఒట్టేసి ఇచ్చిన హామీలు.. ఏ ఏడాది ఆగస్టున నెరవేస్తారో చెప్పాలని మాజీ ఎంపీ కవిత కాంగ్రెస్ ను ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ గ్యారెంటల కే గ్యారెంటీ లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి మానుకోట సభ దానికి నిదర్శనమన్నారు. ప్రజల్లో విశ్వాసం కోల్పోయారు.. కాబట్టి మీ సభలకు దిక్కు దివాన లేదన్నారు.
సార్వత్రిక ఎన్నికల వేళ అధికార, ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా విమర్శించుకుంటున్నాయి. ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. కాంగ్రెస్ అహంకారన్ని దించాలంటే చురుక్కు పెట్టాల్సిందే అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల మేడలు వంచుతామన్నారు.
Komatireddy Venkat Reddy: బీఆర్ఎస్ 2 స్థానాలు గెలిస్తే.. నేను నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా అని రోడ్లు భవనాల శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
KCR: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహించనున్నారు. ఈ బస్సు యాత్ర మే 10వ తేదీ వరకు కొనసాగనుంది. సుమారు 17 రోజుల పాటు సాగే ఈ యాత్రకు ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడంతో పార్టీ అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది.
KCR: బీఆర్ఎస్ అధినేత కే.చంద్రశేఖర్ రావు రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్ర రేపు (బుధవారం) 24వ తేదీన ప్రారంభం కానుంది. ఈ బస్సు యాత్ర మే 10వ తేదీ వరకు కొనసాగనుంది.
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ ప్రచారం జోరందుకుంది. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు పార్లమెంట్ నియోజకవర్గా్ల్లో తిరుగుతూ.. ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తే.. రాత్రికి రాత్రే బీఆర్ఎస్ ను నామరూపాలు లేకుండా చేస్తామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
Etela Rajender: 14 ఏళ్లు తెలంగాణ కోసం కొట్లాడిన పేరు కేసీఆర్ కి రావొచ్చు కానీ కష్టపడింది మేము అని మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.