BRS Foundation Day: నేడు బీఆర్‌ఎస్ 24వ ఆవిర్భావ దినోత్సవాల్సి ప్రతి ఒక్కరు తమ కార్యాలయాల్లో జరుపుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 2001 ఏప్రిల్ 27న జలదర్శిలో రెపరెపలాడిన గులాబీ జెండా విజయవంతమై 23 ఏళ్లు పూర్తి చేసుకొని 24 ఏళ్లలోకి అడుగుపెడుతోందన్నారు. ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్యకర్తలు, నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్‌లో పార్టీ జెండాను కెటి రామారావు ఆవిష్కరించనున్నారు. పార్లమెంటరీ ఎన్నికల్లో పార్టీ మొత్తం నిమగ్నమై ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాల్లో ఆవిర్భావ దినోత్సవాలను నిర్వహించాలని పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.
Read also: Earthquake: తైవాన్‌లో మరోసారి భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 6.1గా నమోదు
ఆవిర్భావ వేడుకల్లో పార్టీ జిల్లా అధ్యక్షులు, కార్యవర్గం, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొనాలని ఆయన సూచించారు. లోక్‌సభ ఎన్నికల కోడ్‌ను దృష్టిలో ఉంచుకుని, బీఆర్‌ఎస్ పార్టీ 24వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఎలాంటి ఆర్భాటాలు లేకుండా నిర్వహించాలని పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు అన్ని జిల్లాల కార్యాలయాల్లో పార్టీ జెండాలను ఎగురవేయాలని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.టి.రామారావు పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా పార్లమెంటరీ ఎన్నికల కార్యక్రమాల్లో పార్టీ మొత్తం నిమగ్నమై ఉన్న నేపథ్యంలో జిల్లా కార్యాలయ కేంద్రంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా పార్టీ కమిటీతో పాటు పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొనాలని కోరారు.
Read also: Rajasthan : చెరువులో కాలు జారి.. తండ్రికొడుకులతో సహా నలుగురు మృతి
తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, అస్తిత్వాలపై ఆధారపడిన బీఆర్‌ఎస్ అనేక ఒడిదుడుకులను చవిచూసింది. ఆనాటి ముందుచూపు వ్యూహం 2009 డిసెంబర్ 9 ప్రకటనకు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి దారితీసింది. 2001లో కరీంనగర్‌లో జరిగిన సింహగర్జన బహిరంగ సభ నుంచి డిసెంబర్ 16, 2010న వరంగల్‌లో జరిగిన తెలంగాణ మహాగర్జన వరకు దాదాపు తెలంగాణలోని ప్రతి మండలంలోనూ, ప్రతి రెవెన్యూ డివిజన్‌లోనూ కేసీఆర్ బహిరంగ సభలు నిర్వహించారు. బస్తీబాట, పల్లెనిద్ర, తండానిద్ర ఇలా అనేక రూపాల్లో దాదాపు 14 ఏళ్లపాటు అవిశ్రాంతంగా పోరాడారని తెలిపారు.
Earthquake: తైవాన్‌లో మరోసారి భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 6.1గా నమోదు