కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సీబీఐకు ఫిర్యాదు చేశారు. ప్రజాశాంతి పార్టీ, గ్లోబల్ పీస్ కమిటీ ఆధ్వర్యంలో.. కోఠిలోని సీబీఐ జీడీకి కంప్లైంట్ చేసినట్లు పాల్ తెలిపారు.
దళితుల బంధువును సత్వరమే లబ్ధిదారులకు పంపిణీ చేయకుంటే తాను, గుర్తించిన లబ్ధిదారులందరితో కలిసి నెక్లెస్ రోడ్డులోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు హెచ్చరించారు. ఏప్రిల్ 13, శనివారం లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా చేవెళ్లలో జరిగిన బహిరంగ సభలో రావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 1.30 లక్షల మంది లబ్ధిదారులకు BRS ప్రభుత్వం దళిత బంధు మంజూరు చేసినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం లబ్ధిదారులకు నిధులు…
కడియం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న బీఆర్ఎస్ అధిష్ఠానం.. ఆయనకు ఎలాగైన బుద్ధి చెప్పాలన్న యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కడియం నిలబడితే.. ఆయనకు పోటీగా తాటికొండ రాజయ్యను బరిలో దింపాలనుకుంటున్నట్టు తెలుస్తోంది.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బై ఎలక్షన్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదితను ప్రకటించారు. కాసేపటి క్రితం బీఆర్ఎస్ అధినేత కంటోన్మెంట్ ఉప ఎన్నిక, అభ్యర్థి ఎవరన్న దానిపై చర్చలు కొనసాగాయి. తాజాగా.. దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్న కూతురు, దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత చెల్లి నివేదితను ఖరారు చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ముఖ్య నేతల సమావేశంలో బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో.. ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ కి కంటోన్మెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలు వచ్చారు. అనంతరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేటీఆర్, హరీష్ రావు, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మల్కాజ్ గిరి ఎంపీ అభ్యర్థి లక్ష్మా రెడ్డి, దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసాలకు కేరాఫ్ అడ్రస్ అని, ఆ పార్టీది ‘ఆపన్న హస్తం కాదని, భస్మాసుర హస్తమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ‘పాంచ్ న్యాయ్’ పేరుతో మళ్లీ కొత్త హామీలతో ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమైందన్నారు. తెలంగాణను 10 ఏళ్లపాటు పాలించిన కేసీఆర్ రాష్ట్రంలో రైతుల దుస్థితికి ప్రధాన కారణమన్నారు.