KCR: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. తొలిసారి సోషల్ మీడియాలోకి అడుగుపెట్టారు. @KCRBRSpresident పేరుతో కేసీఆర్ తన X ఖాతాను తెరిచారు. అంతేకాదు.. కేసీఆర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా కూడా తెరిచారు. ఖాతా ఓపెన్ చేసిన గంటల వ్యవధిలోనే 6521 మంది ఫాలోవర్స్ వచ్చారు. ఇక నుంచి కేసీఆర్ ఎక్స్ వేదికగా విస్తృత ప్రచారం చేయనున్నారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ బస్సుయాత్ర చేపట్టి ఆయా నియోజకవర్గాల్లో రోడ్ షోలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ యాత్రకు సంబంధించిన వివరాలను అలాగే రాజకీయాలను ఎప్పటికప్పుడు ఎక్స్ అకౌంట్ లో కేసీఆర్ పంచుకుంటారు. ఎక్స్ ద్వారా కేసీఆర్ ఎలాంటి విషయాలను పంచుకుంటారోనని నెటిజన్లు, రాజకీయ వర్గాలు, మరికొందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ ఖాతాల ద్వారా కేసీఆర్ ట్రెండ్ సృష్టించే అవకాశం ఉందని నెటిజన్లు భావిస్తున్నారు. కేసీఆర్‌ని ఎక్స్‌లో ఫాలో కావాలనుకునే వారు Link – http://x.com/kcrbrspresident ఈ లింక్‌ను క్లిక్ చేయండి.
Read also: Bandi Snajay: అలా నిరూపిస్తే పోటీ నుండి తప్పుకుని.. కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తా..
బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇప్పటికైనా సోషల్ మీడియాలో ఖాతా లేని వారు వెంటనే తెరవాలని ఆయన సూచించారు. ప్రజలకు చేరువయ్యేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి పార్టీ క్యాడర్‌లో ఐక్యత పెంచడమే కాకుండా వారిలో ఉత్సాహాన్ని నింపుతున్నారు. ప్రస్తుతం ఎన్నికల సంవత్సరం కావడంతో మరింత మందికి చేరువ కావాలంటే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండాలని సూచించారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు నాయకులు, కార్యకర్తలకు పార్టీ సందేశాన్ని చేరవేస్తున్నారని తెలిపారు. అంతే కాకుండా ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న అనవసర ఆరోపణలను సోషల్ మీడియా ద్వారా తిప్పికొట్టాలని, తమ ప్రచారం అబద్ధమని నేతలకు చురకలంటిస్తున్నారు.
Malla Reddy: నువ్వే గెలుస్తావన్న మల్లారెడ్డి వ్యాఖ్యలు వైరల్.. కౌంటర్ ఇచ్చిన మాజీ మంత్రి