CM Revanth Reddy : కారు ఇక తుకానికి పోవాల్సిందే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత ఎన్నికల్లో కారు షెడ్డుకు పోయింది.. కార్ఖానా నుంచి ఇక కారు వాపసు రాదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కంటోన్మెంట్ కార్నర్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కారు ఇక తుకానికి పోవాల్సిందేనని ఆయన అన్నారు. గద్దరన్నను అవమానించిన ఉసురు తగిలి కేసీఆర్ ప్రభుత్వం కూలిపోయిందని, పేదల చెమట గిట్టని కేసీఆర్… బస్సు యాత్ర మొదలు పెట్టిండన్నారు రేవంత్ రెడ్డి. బస్సు యాత్ర కాదు.. ఆయన మోకాళ్ల యాత్ర చేపట్టినా తెలంగాణ ప్రజలు నమ్మరని, సినిమా వాళ్లు చనిపోతే అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేసిన కేసీఆర్… సాయన్నకు మాత్రం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేయలేదన్నారు. కంటోన్మెంట్ ప్రజలు ఈ విషయాన్ని ఎప్పటికీ మరిచిపోరని, కంటోన్మెంట్ ప్రజల ఓట్లు తొలగించి మీకు కేసీఆర్ అన్యాయం చేశారన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
అంతేకాకుండా..’ఎలివేటేడ్ కారిడార్ జాప్యంతో ఈ ప్రాంతం ట్రాఫిక్ జామ్ తో అతలాకుతలమైంది.. తాగు నీటి సమస్య, రోడ్ల సమస్య పరిష్కారం కావాలంటే కంటోన్మెంట్ లో శ్రీ గణేష్ గెలవాలి.. ఈ కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో కలిపితేనే మీ సమస్యలు పతిష్కారమవుతాయి.. శ్రీ గణేష్ ను ఎమ్మెల్యేగా, సునీతా మహేందర్ రెడ్డిని ఎంపీగా గెలిపించండి.. మీ నాయకుడిగా మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది.. ఈ ప్రాంతంలో ఆసుపత్రి లేకపోతే ఎంపీగా ఉన్నప్పుడు ఆసుపత్రి నిర్మించి మీ సమస్యను పతిష్కరించా.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం.. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నాం.. పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం.. పేదలకు ఇల్లు కట్టుకునేందుకు రూ.5లక్షలు అందిస్తున్నాం.. రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందించి ఆడబిడ్డల కష్టాలు తీరుస్తున్నాం.. ట్రాఫిక్ సమస్యను తీర్చేందుకు ఎలివేటేడ్ కారిడార్ కు శంకుస్థాపన చేసుకున్నాం.. వచ్చే పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది… కంటోన్మెంట్ లో 25వేల మెజారిటీతో శ్రీగణేష్ ను గెలిపించండి..
Also Read
కంటోన్మెంట్ నుంచి ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డికి 25వేల మెజారిటీ ఇవ్వండి…సునీతమ్మకు వేసే ప్రతీ ఓటు మీ రేవంత్ అన్నకు వేసినట్టే.. ఈ ఆడబిడ్డను గెలిపించి పార్లమెంట్ కు పంపండి… కేసీఆర్ చచ్చిన పాముతో సమానం… ఇక ఆయన కథ కంచికే. బస్సు యాత్ర తరువాత ఇక ఆయనకు తీర్ధ యాత్రలే దిక్కు.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్లు దండుకోవాలని చూస్తోంది… దేవుడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెల్లో ఉండాలి.. రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ కుట్ర చేస్తోంది.. బీజేపీ కి 400 సీట్లు ఇస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారు… రిజర్వేషన్లు రద్దు చేసి.. రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ కుట్ర చేస్తోంది..బీజేపీ కుట్రను తిప్పి కొట్టాల్సిన బాధ్యత మీపై ఉంది.. రిజర్వేషన్ల రద్దుపై ఈటెల రాజెందర్ వైఖరి ఏంటో చెప్పాలి.. కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలబడండి.. మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది..’ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!