KCR Writes Letter on Power Purchase Agreements To Justice L Narasimha Reddy Commission: జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్‌కు బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ లేఖ రాశారు. తెలంగాణలో విద్యుత్ కొనుగోలు, కొత్త ప్రాజెక్టుల నిర్మాణ టెండర్లపై కేసీఆర్ లేఖ ద్వారా వివరణ ఇచ్చారు. అన్నిరకాల చట్టాలు, నిబంధనలు పాటిస్తూ ముందుకెళ్లాం అని తెలిపారు. ఈఆర్సీ సంస్థలు వెలువరించిన తీర్పులపై కమిషన్లు వేయకూడదన్న విషయం కూడా ప్రభుత్వానికి తెలియదా? అని…
T Rammohan Reddy: మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శలు కరెక్ట్ కాదని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ చౌక బారు రాజకీయాలు చేస్తుందన్నారు.
KTR: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తీహార్ జైలులో వున్న ఎమ్మెల్సీ కవితకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిశారు. శుక్రవారం కవితను మర్యాదపూర్వకంగా కలిసారు.
Balmoori Venkat: కేటీఆర్ పై ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఫైర్ అయ్యారు. కేటీఆర్ చేస్తున్న ప్రచారం అబద్దమైతే ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్పి ముక్కు నెలకు రాయాలని డిమాండ్ చేశారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక మోసగాడు పదేళ్లు తెలంగాణ పరిపాలించాడని తీవ్రంగా విమర్శించారు. ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్ర్యం వస్తే.. జిన్నా ఆగస్టు 14న వేడుకలు చేసుకున్నాడని విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కూడా అట్లనే జూన్ 1 నుండి వేడుకలు చేస్తున్నాడన్నారు.
CPI Narayana Slams KCR: ప్రతి క్షంలో కూర్చున్నా కూడా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కి జ్ఞానోదయం కలగలేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఆరు నెలలు కేబినెట్ ప్రకటించని సీఎం దేశంలో కేసీఆర్ తప్ప ఎవరు లేరని ఎద్దేవా చేశారు. అహంభావంతో కేసీఆర్ పరిపాలన చేశాశారని, అందుకే ఈ సారి ప్రజలు రేవంత్ రెడ్డికి పట్టం కట్టారన్నారు. గతంలో జరిగిన తప్పులను గుర్తించి.. తెలంగాణ అభివృద్ధి కోసం…
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలిముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ స్వరాష్ట్రమై పదేండ్లు పూర్తిచేసుకున్న చారిత్రక సందర్భంలో రాష్ట్ర సాధన కోసం సాగిన పోరాటాలు త్యాగాలను స్మరించుకున్నారు.
రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో పాల్గొనాలని ప్రభుత్వం మాజీ సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేసీఆర్ 22 పేజీల బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో బీఆర్ఎస్ పాల్గొనదని ఆ లేఖలో తెలిపారు.
సోనియా లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు, ఆ విషయాన్ని కేసీఆర్ నిండు సభలో చెప్పారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. కేసీఆర్ ప్రభుత్వంలో అన్ని స్కీంలలో స్కామ్‌లు జరిగాయని.. గొర్రెల పథకంలో భారీ స్కాం జరిగిందన్నారు. నిజామాబాద్ పార్లమెంట్‌తో సహా 12 పార్లమెంట్ స్థానాల్లో గెలుస్తామన్నారు.
తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రభుత్వం ఆహ్వానించింది. విపక్ష నేతగా, తెలంగాణ ఉద్యమ భాగస్వామిగా కేసీఆర్‌ను ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.